ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Adani Group : అదానీ చేతికి మరో ప్రముఖ మీడియా గ్రూప్

ABN, First Publish Date - 2023-03-28T13:21:06+05:30

క్వింటిలియన్ బిజినెస్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్‌ లో 49 శాతం వాటాను సుమారు రూ.48 కోట్లతో

Gautam Adani
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ : క్వింటిలియన్ బిజినెస్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్‌ (Quintillion Business Media Pvt Ltd)లో 49 శాతం వాటాను సుమారు రూ.48 కోట్లతో ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ (Gautam Adani)కి చెందిన ఏఎంజీ మీడియా నెట్‌వర్క్స్‌ కొనుగోలు చేసింది. ఈ వివరాలను అదానీ ఎంటర్‌ప్రైజస్ లిమిటెడ్ (Adani Enterprises Ltd) స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు తెలిపింది. ఈ లావాదేవీ గురించి గత ఏడాది మే నెలలో ప్రకటించిన సంగతి తెలిసిందే.

రూ.47.84 కోట్ల విలువైన ఈ లావాదేవీ మార్చి 27న పూర్తయిందని అదానీ ఎంటర్‌ప్రైజస్ తెలిపింది. బ్లూమ్‌బర్గ్ క్వింట్ (Bloomberg Quint) అనే డిజిటల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను క్వింటిలియన్ బిజినెస్ మీడియా నడుపుతోంది. ప్రస్తుతం దీనిని బీక్యూ ప్రైమ్ అని పిలుస్తున్నారు. అదానీ గ్రూప్ ప్రచురణలు, ప్రకటనలు, సమాచార ప్రసారాలు, వివిధ మీడియా నెట్‌వర్క్‌లకు కంటెంట్ పంపిణీ వ్యాపారాల్లోకి ప్రవేశించేందుకు ఏఎంజీ మీడియా నెట్‌వర్క్స్‌ను ఏర్పాటు చేసింది. క్వింటిలియన్ మీడియా లిమిటెడ్, క్యూబీఎంఎల్‌లతో గత ఏడాది మే నెలలో షేర్‌హోల్డర్స్ అగ్రిమెంట్‌ను కుదుర్చుకుంది. అదానీ మీడియా వెంచర్స్‌ను నడిపేందుకు వెటరన్ జర్నలిస్ట్ సంజయ్‌ని 2021 సెప్టెంబరులో నియమించుకుంది.

ఇవి కూడా చదవండి :

Gold and Silver Price : పెరగడమేమో వేలల్లో.. తగ్గితే పైసల్లో..

America : రాహుల్ గాంధీ అనర్హతపై అమెరికా సంచలన వ్యాఖ్యలు

Updated Date - 2023-03-28T13:21:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising