ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Adi Yogi: ఆకాశం నుంచే ఆది యోగి దర్శనం

ABN, First Publish Date - 2023-02-11T07:24:07+05:30

కోయంబత్తూరు(Coimbatore) సమీపంలోని ఈషా యోగాకేంద్రంలో జరుగనున్న శివరాత్రి(Shivratri) వేడుకల్లో పాల్గొనేందుకు విచ్చేస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- రాష్ట్రపతి పర్యటనకు భద్రత పటిష్ఠం

చెన్నై, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): కోయంబత్తూరు(Coimbatore) సమీపంలోని ఈషా యోగాకేంద్రంలో జరుగనున్న శివరాత్రి(Shivratri) వేడుకల్లో పాల్గొనేందుకు విచ్చేస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu) అక్కడి 112 అడుగుల ఎత్తైన ఆదియోగి విగ్రహాన్ని హెలికాప్టర్‌లో ప్రదక్షిణ చేస్తూ తిలకించనున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రపతి ఈ నెల 18న మదురై వస్తున్న విషయం తెలిసిందే. తొలుత మదురై మీనాక్షి అమ్మవారి ఆలయాన్ని ఆమె దర్శించనున్నారు. అక్కడి నుంచి విమానంలో కోయంబత్తూరుకు చేరుకుని, సూలూరు వైమానిక దళం నుంచి హెలికాప్టర్‌లో ఈషా సెంటర్‌కు చేరుకుంటారు. ఆ రోజు రాత్రి ఈషా కేంద్రంలో భారీగా నిర్వహించే శివరాత్రి వేడుకల్లో ఆమె పాల్గొననున్నారు. ఆ సందర్భంగా అక్కడి 112 అడుగుల ఆదియోగి విగ్రహాన్ని ఆమె హెలికాప్టర్‌ నుంచి వీక్షించనున్నారు. అందుకు తగిన ఏర్పాట్లను ఈషా కేంద్రం నిర్వాహకులు చేపడుతున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఈషా సెంటర్‌ నిర్వాహకులు సద్గురు ఆహ్వానించనున్నారు. ఈషా కేంద్రంలోని లింగభైరవి, ధ్యానలింగం తదితర సన్నిధులను రాష్ట్రపతి దర్శించనున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా భారీ భద్రత ఏర్పాట్లు చేపట్టేందుకు జిల్లా పోలీసులు, నగర పోలీసులు సంయుక్తంగా చర్యలు చేపడుతున్నారు. ఐదంచెల భద్రతా ఏర్పాట్లను కల్పించనున్నట్లు డీజీపీ శైలేంద్రబాబు(DGP Shailendra Babu) ప్రకటించారు.

Updated Date - 2023-02-11T07:24:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising