ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

China : చైనాలో మరో జాక్ మా సంఘటన... బావో ఫాన్ అదృశ్యం...

ABN, First Publish Date - 2023-02-18T14:44:34+05:30

చైనాలో వ్యాపార దిగ్గజాలు సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తోంది. అలీబాబా గ్రూప్ సహ వ్యవస్థాపకుడు జాక్ మా

Bao Fan , Chinese Investment Banker
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజింగ్ : చైనాలో వ్యాపార దిగ్గజాలు సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తోంది. అలీబాబా గ్రూప్ సహ వ్యవస్థాపకుడు జాక్ మా (Jack Ma) కొంత కాలం క్రితం అంతుచిక్కని రీతిలో దేశం విడిచి వెళ్లిపోయారు. ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్, ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్ చైనా రినయ్‌సెన్స్ (China Renaissance) చైర్మన్, సీఈఓ బావో ఫాన్ (Bao Fan) ఆచూకీ తెలియడం లేదు. బావో ఫాన్‌ను సంప్రదించడం సాధ్యం కావడం లేదని ఈ బ్యాంక్ ఓ ప్రకటనలో తెలిపింది.

బావో ఫాన్ అందుబాటులో లేకపోవడానికి, తమ కంపెనీ వ్యాపార కార్యకలాపాలకు సంబంధం ఉందో, లేదో తెలియదని ఈ ప్రకటన పేర్కొంది. ఈ వార్త దావానలంలా వ్యాపించడంతో ఈ కంపెనీ షేర్లు శుక్రవారం 50 శాతం పతనమయ్యాయి. బావో ఫాన్ 1990వ దశకంలో ఇన్వెస్ట్‌‌మెంట్ బ్యాంకింగ్ కెరీర్‌ను ప్రారంభించారు. మోర్గాన్ స్టాన్లీ (Morgan Stanley), క్రెడిట్ సూసీ (Credit Suisse)లలో ఆయన కెరీర్ సాగింది. ఆ తర్వాత ఆయన షాంఘై, షెంజెన్‌లలోని స్టాక్ ఎక్స్ఛేంజ్‌లలో అడ్వయిజర్‌గా పని చేశారు. ఆయన చైనా రినయ్‌సెన్స్‌ను 2005లో కేవలం ఇద్దరితో ప్రారంభించారు. వెంచర్ కేపిటలిస్టులు, ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్లకు సేవలందించారు. ఆ తర్వాత అండర్‌రైటింగ్, సేల్స్, ట్రేడింగ్‌లకు తన సేవలను విస్తరించారు. ఈ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ 2018లో హాంగ్ కాంగ్ మార్కెట్లోకి ప్రవేశించింది. చైనాలోని ప్రధాన ఫుడ్ డెలివరీ సర్వీసులు మెయిటువన్, డియన్‌పింగ్ 2015లో విలీనమవడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.

చైనాలోని 60 ట్రిలియన్ డాలర్ల ఫైనాన్షియల్ సెక్టర్‌పై 2021 నుంచి అవినీతి నిరోధక శాఖ దర్యాప్తు చేస్తోంది. 2021లోనే జాక్ మా కూడా అదృశ్యమయ్యారు. చైనాలోని ఫైనాన్షియల్ రెగ్యులేటర్స్‌ను ఆయన విమర్శించిన తర్వాత వార్తల్లో కనిపించలేదు. ప్రస్తుతం ఆయన తన కుటుంబ సభ్యులతోపాటు జపాన్‌లో ఉన్నట్లు మీడియా కథనాలనుబట్టి తెలుస్తోంది. చైనీస్ ఫిన్‌టెక్ జెయింట్ యాంట్ గ్రూప్ (Ant Group) షేర్‌హోల్డర్లు అనేక సర్దుబాట్లకు గత నెలలో ఆమోదం తెలిపారు. దీంతో ఆయన ఓటింగ్ హక్కులు వదులుకోవలసి వస్తోంది.

ఇవి కూడా చదవండి :

George Soros Vs India : జార్జి సొరోస్‌పై విదేశాంగ మంత్రి జైశంకర్ ఘాటు వ్యాఖ్యలు

Sharad Pawar : ఎన్నికల గుర్తు మార్పుపై ఉద్ధవ్ థాకరేకు శరద్ పవార్ సలహా

Updated Date - 2023-02-18T14:44:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising