ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vijayavargiya: నిస్సందేహంగా ఇది హిందూ దేశమే..!

ABN, First Publish Date - 2023-03-22T13:54:44+05:30

దేశ విభజన అనంతరం ఇండియా 'హిందూ దేశం'గా ఏర్పడిందని భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గీయ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఇండోర్: దేశ విభజన (Partition) అనంతరం ఇండియా 'హిందూ దేశం'గా ఏర్పడిందని భారతీయ జనతా పార్టీ (BJP) ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గీయ (Kailash Vijayavargiya) అన్నారు. 1947లో మత ప్రాతిపదికపై దేశ విభజన జరిగిందని, విభజనలో పోయింది పోగా ఏదైతే మిగిలిందో అది హిందూ దేశంగా ఏర్పడిందని చెప్పారు. ఇండియాను హిందూదేశంగా ప్రకటించాలంటూ ఒక వర్గం చేస్తున్న డిమాండ్‌పై మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

'హనుమాన్ చాలీసా'ను కొందరు వివాదం చేస్తుండటంపై రాష్ట్ర మాజీ మంత్రి విజయవర్గీయ మాట్లాడుతూ, తనకు భోపాల్‌లో ఒక ముస్లిం మిత్రుడు ఉన్నాడని, అతను ప్రతిరోజూ హనుమాన్ చాలీసా చదువుతాడని, శివాలయానికి వెళ్తాడని చెప్పారు. తన ముస్లిం మిత్రుడు తరహాలోనే ఈ దేశంలోని చాలామంది తమ పూర్వీకులు ఒకప్పుడు హనుమాన్ చాలీసా పఠించేవారని నమ్ముతారని చెప్పారు. '' ఏ స్ఫూర్తితో హనుమంతుడు, శివుడిని ఆరాధిస్తున్నావని నా మిత్రుడిని అడిగాను. తన పూర్వీకుల కుటుంబ చరిత్ర తనకు స్ఫూర్తిగా నిలిచిందని చెప్పాడు. అతని పూర్వీకులు రాజస్థాన్ రాజ్‌పుత్‌లు. ఇప్పటికీ అతని బంధువులు కొందరు రాజ్‌పుత్‌లుగానే రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లో నివసిస్తున్నారు'' అని విజయవర్గీయ చెప్పారు. యువతను మాదకద్రవ్యాలకు దూరంగా ఉంచేందుకు ''హనుమాన్ చాలీసా క్లబ్'' ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు కూడా మాజీ మంత్రి తెలిపారు.

కైలాస్ విజయవర్గీయ ఇటీవల అగ్నివీరులపై చేసిన వ్యాఖ్యలు వివాదం రేపాయి. బీజేపీ కార్యాలయంలో సెక్యూరిటీ ఉద్యోగాల్లో అగ్నివీర్‌లను నియమించేందుకు తాను ప్రాధాన్యత ఇస్తానని ఆయన వ్యాఖ్యనించారు. దీనిపై విమర్శలు రావడంతో ఆయన వెంటనే వివరణ ఇచ్చారు. రక్షణ రంగంలో సేవలు పూర్తి చేసుకున్న తర్వాత అగ్నివీరులు తమ ప్రతిభను వారు కోరుకున్న రంగంలో ఉపయోగించుకోవచ్చని చెప్పడమే తన ఉద్దేశమని అన్నారు.

Updated Date - 2023-03-22T13:54:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising