ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Naroda Gam massacre case: నరోదా గామ్ కేసులో నిందితులందరూ నిర్ధోషులు.. ప్రత్యేక కోర్ట్ సంచలన తీర్పు!

ABN, First Publish Date - 2023-04-20T19:09:12+05:30

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2002 నాటి నరోదా గామ్ నరమేధం కేసులో (2002 Naroda Gam massacre) కీలక పరిణామం చోటుచేసుకుంది. మత ఘర్షణల సమయంలో ముస్లిం వర్గానికి చెందిన 11 మంది ఊచకోతకు గురయిన ఈ కేసులో ....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అహ్మదాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2002 నాటి నరోదా గామ్ నరమేధం కేసులో (2002 Naroda Gam massacre) కీలక పరిణామం చోటుచేసుకుంది. మత ఘర్షణల సమయంలో ముస్లిం వర్గానికి చెందిన 11 మంది ఊచకోతకు గురయిన ఈ కేసులో నిందితులందరూ నిర్ధోషులేనని గుజరాత్ అహ్మదాబాద్‌లోని ప్రత్యేక కోర్టు తీర్పు (Special court) వెలువరించింది. మొత్తం 68 మందిని నిర్ధోషులుగా తేల్చింది. బీజేపీ మాజీ ఎమ్మెల్యే మాయా కొద్నాని (Maya Kodnani), భజరంగ్ దళ్ మాజీ లీడర్ బాబు భజరంగి ఈ జాబితాలో ఉన్నారు. కాగా ఈ కేసులో నిందితుల సంఖ్య మొత్తం 86 కాగా విచారణ సమయంలో 18 మంది చనిపోయారు. నిందితులపై 302 (హత్య), 307 (హత్యాయత్నం), 143 (చట్టవిరుద్ధంగా గుమిగూడడం), 147 (ఘర్షణలు), 148 (మరణాయుధాలతో అల్లర్లు), 120(B) (నేరపూరిత కుట్ర), 153 (అల్లర్లకు పురిగొల్పడం)తోపాటు ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.

అసలేం జరిగిందంటే...

గుజరాత్‌ రాష్ట్రం అహ్మదాబాద్‌ నగరంలోని నరోదా గామ్ (Naroda Gam) అనేది ఒక ప్రాంతం. 2002లో గోద్రా రైలు దహనానికి (Godhra train burning) నిరసనగా అన్ని ప్రాంతాల మాదిరిగా ఇక్కడ కూడా బంద్ జరిగింది. కానీ అనూహ్యంగా ఘర్షణలు చెలరేగాయి. ఈ అల్లర్లలో ముస్లిం వర్గానికి చెందిన 11 మంది హత్యకు గురయ్యారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. నరోదా పాటియా, నరోదా గామ్ నరమేధం కేసులపై సిట్ (స్పెషల్ ఇన్వెస్ట్‌గేషన్ టీమ్) దర్యాప్తు చేపట్టింది. గుజరాత్ మాజీ మంత్రి, బీజేపీ నేత మాయా కొడ్నానిని 2008లో నిందితురాలిగా పేర్కొంది. నరోదా పాటియా నరమేధం కేసులో పాత్రకుగానూ మాయా కొద్నానికి 28 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ ఆగస్టు 2012లో స్పెషల్ సిట్ కోర్ట్ తీర్పునిచ్చింది. అయితే ఏప్రిల్ 2018లో ట్రయల్ కోర్ట్ తీర్పును గుజరాత్ హైకోర్ట్ కొట్టివేసింది. దీంతో ఆమె నిర్ధోషిగా విడుదలయ్యారు.

Updated Date - 2023-04-20T19:15:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising