ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

America : డొనాల్డ్ ట్రంప్‌పై ఏడు ఆరోపణలతో కేసు నమోదు

ABN, First Publish Date - 2023-06-09T09:36:50+05:30

ప్రభుత్వానికి సంబంధించిన అత్యంత రహస్య పత్రాల నిర్వహణకు సంబంధించిన కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ఏడు ఆరోపణలు నమోదయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్ : ప్రభుత్వానికి సంబంధించిన అత్యంత రహస్య పత్రాల (classified documents) నిర్వహణకు సంబంధించిన కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)పై ఏడు ఆరోపణలు నమోదయ్యాయి. అమెరికా అధ్యక్ష పదవి నుంచి వైదొలగిన తర్వాత ఆయన ఈ పత్రాలను ఫ్లోరిడాలోని తన నివాసంలో ఉంచుకున్నట్లు ఫెడరల్ గ్రాండ్ జ్యూరీ కేసు నమోదు చేసింది. ఆయన తప్పుడు స్టేట్‌మెంట్లు ఇచ్చినట్లు, న్యాయ ప్రక్రియకు ఆటంకం కలిగించినట్లు కూడా ఆరోపించింది.

అమెరికా మాజీ అధ్యక్షుడిపై ఫెడరల్ జ్యూరీ ఆరోపణలను నమోదు చేయడం ఇదే తొలిసారి. ట్రంప్‌పై క్రిమినల్ కేసు నమోదు కావడం ఇది రెండోసారి. ఈ సమాచారాన్ని ట్రంప్ లీగల్ టీమ్‌కు ఫెడరల్ జ్యూరీ తెలియజేసిందని విశ్వసనీయ వర్గాలు తెలిపినట్లు ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ వెల్లడించింది. ఆయనను మంగళవారం మియామీ కోర్టులో హాజరుకావాలని ఆదేశించినట్లు తెలిపింది. ఈ ఆరోపణలను గోప్యంగా ఉంచారు. ఈ ఆరోపణల గురించి పూర్తి వివరాలు ట్రంప్‌నకు కూడా తెలియదని సమాచారం.

ట్రంప్ తన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్‌లో స్పందిస్తూ, తాను అమాయకుడినని చెప్పారు. తనను మియామీ కోర్టులో మంగళవారం హాజరు కావాలని ఆదేశించారని తెలిపారు. ఇది అమెరికాకు చీకటి రోజు అని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా వేగంగా పతనమవుతోందని, మనమందరం కలిసి అమెరికాను మళ్లీ గొప్పగా తీర్చిదిద్దుదామని పిలుపునిచ్చారు. అవినీతిలో కూరుకుపోయిన జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ తనపై కేసు నమోదు చేసినట్లు తన అటార్నీకి తెలియజేసిందన్నారు. తప్పుడు పుకార్ల ఆధారంగా ఈ కేసు నమోదు చేశారని మండిపడ్డారు.

ట్రంప్‌పై నమోదైన ఆరోపణలు

ప్రభుత్వానికి సంబంధించిన అత్యంత రహస్య పత్రాలను ఉద్దేశపూర్వకంగా తన వద్ద ఉంచుకోవడం (గూఢచర్య చట్టం), న్యాయ ప్ర్రక్రియను అడ్డుకోవడానికి కుట్ర పన్నడం, ఓ డాక్యుమెంట్ లేదా రికార్డును తన వద్ద ఉంచుకోవడం, ఓ డాక్యుమెంట్ లేదా రికార్డును నిజాయితీ లేకుండా దాచిపెట్టడం, ఫెడరల్ దర్యాప్తులో ఓ డాక్యుమెంట్‌ను దాచిపెట్టడం, గుట్టు బయటపడకుండా పథకం అమలు చేయడం, తప్పుడు స్టేట్‌మెంట్లు, రిప్రజెంటేషన్లు ఇవ్వడం. ఈ ఆరోపణలు రుజువైతే ట్రంప్‌నకు గరిష్ఠంగా 100 సంవత్సరాల జైలు శిక్ష విధించవచ్చు.

అమెరికా అధ్యక్ష పదవి నుంచి వైదొలగిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి సంబంధించిన అత్యంత రహస్య పత్రాలను మిస్‌హ్యాండిల్ చేశారా? అనే అంశంపై దర్యాప్తు చేస్తున్నట్లు జస్టిస్ డిపార్ట్‌మెంట్ 2021లో ప్రకటించింది. ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లో ఉన్న ట్రంప్ నివాసం మార్-ఏ-లగో ఎస్టేట్ నుంచి దాదాపు 13,000 డాక్యుమెంట్లను దర్యాప్తు అధికారులు దాదాపు సంవత్సరం క్రితం స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 100 డాక్యుమెంట్లు రహస్య పత్రాలని నిర్థరించారు. అయితే ట్రంప్ తరపు న్యాయవాదులు మాట్లాడుతూ, రహస్య డాక్యుమెంట్లను ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేసినట్లు తెలిపారు. అయితే ట్రంప్ స్పందిస్తూ, తాను ఈ పత్రాలను డీక్లాసిఫై చేశానని చెప్తున్నారు. కానీ అందుకు సాక్ష్యాధారాలను ఆయన చూపించడం లేదు. ఆయన తరపు న్యాయవాదులు ఈ వాదనను కోర్టులో వినిపించేందుకు తిరస్కరించారు.

2016 ఎన్నికలకు ముందు ఓ పోర్న్ స్టార్‌కు హుష్ మనీ చెల్లించినట్లు, దీనికి సంబంధించి తన బిజినెస్ రికార్డులను తప్పుగా రాసినట్లు ట్రంప్‌పై ఏప్రిల్‌లో ఆరోపణలు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో తాను నిరపరాధినని ఆయన వాదిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

BJP RSS: బీజేపీకి ఆర్‌ఎస్‌ఎస్ కీలక హెచ్చరిక.. ఆ రెండింటినే నమ్ముకుంటే పనికాదని కుండబద్ధలు..!

నిర్ణీత క్రెడిట్స్‌ వస్తే చాలు డిగ్రీ ప్రదానం

Updated Date - 2023-06-09T09:36:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising