Manipur : మణిపూర్ వీడియో లీకేజ్ వెనుక కుట్ర : అమిత్ షా
ABN, First Publish Date - 2023-07-28T10:06:12+05:30
దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలకు కారణమైన మణిపూర్ మహిళల నగ్న వీడియో వెనుక కుట్ర ఉన్నట్లు ప్రాథమికంగా తెలుస్తోందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) చెప్పారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందు ఈ వీడియోను విడుదల చేసి, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు.
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలకు కారణమైన మణిపూర్ మహిళల నగ్న వీడియో వెనుక కుట్ర ఉన్నట్లు ప్రాథమికంగా తెలుస్తోందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) చెప్పారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందు ఈ వీడియోను విడుదల చేసి, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు. 1990వ దశకం నుంచి ఇప్పటి వరకు మణిపూర్‌లో కుకీ-మెయిటీ తెగల మధ్య జరుగుతున్న ఘర్షణల గురించి మీడియాకు వివరించారు.
మణిపూర్ హింసాత్మక ఘర్షణలకు సంబంధించిన ఏడు కేసుల దర్యాప్తు బాధ్యతను కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI)కి అప్పగించినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సుప్రీంకోర్టుకు తెలిపింది. మే 4న ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన సంఘటనకు సంబంధించిన కేసు కూడా దీనిలో ఉన్నట్లు వివరించింది. ఈ కేసుల విచారణను వేరొక రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరింది.
అమిత్ షా గురువారం మీడియాతో మాట్లాడుతూ, 1990వ దశకం నుంచి కుకీ-మెయిటీ తెగల మధ్య జరుగుతున్న ఘర్షణలను వివరించారు. మే 4న ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన సంఘటనను వీడియో చిత్రీకరించిన వ్యక్తిని అరెస్ట్ చేసి, దీనిని చిత్రీకరించేందుకు ఉపయోగించిన మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రాథమికంగా చూసినపుడు ఈ వీడియోను విడుదల చేయడం వెనుక కుట్ర కనిపిస్తోందన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల ముందు దీనిని విడుదల చేసి, తద్వారా మోదీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనే కుట్ర కనిపిస్తోందన్నారు. మరో రెండు వీడియోలపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారన్నారు. మణిపూర్‌లో పరిస్థితిని మరింత తీవ్రంగా రెచ్చగొట్టడం కోసం ఈ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారన్నారు. ఈ వీడియోలలో చూపిన సంఘటనలు 2022లో మయన్మార్‌లో జరిగినట్లు గుర్తించామన్నారు.
ఆరు కేసులను ఇప్పటికే సీబీఐకి అప్పగించామని, మరొకదానిని అప్పగించే ప్రక్రియ జరుగుతోందని తెలిపారు. నిష్పాక్షికత కోసం ఈ కేసుల విచారణ వేరొక రాష్ట్రంలో జరగాలని సుప్రీంకోర్టును కోరినట్లు తెలిపారు. మరికొన్ని కేసుల దర్యాప్తు బాధ్యతను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కు అప్పగించినట్లు తెలిపారు.
మెయిటీలకు ఎస్టీ హోదా కల్పించడంపై పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మణిపూర్ హైకోర్టు ఆదేశించడంతో, కుకీలు మే 3 నుంచి నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో ఇరు తెగల మధ్య హింసాత్మక ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ ఘర్షణల్లో 147 మంది ప్రాణాలు కోల్పోగా, 40 వేల మంది నిరాశ్రయులయ్యారు.
మణిపూర్ పరిస్థితిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటులో మాట్లాడాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. చివరికి కాంగ్రెస్, బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానాలను లోక్‌సభకు సమర్పించాయి.
ఇవి కూడా చదవండి :
Congress Vs BJP : ‘రెడ్ డైరీ’లో కాంగ్రెస్ చీకటి రహస్యాలు : మోదీ
BJP Annamalai: నేడు అన్నామలై పాదయాత్ర ప్రారంభం
Updated Date - 2023-07-28T10:06:12+05:30 IST