Amit shah: ఎరుపు రంగు అంటే ఆ సీఎంకు హడల్..!
ABN, First Publish Date - 2023-08-26T18:41:08+05:30
రాజస్థాన్ ప్రభుత్వ అవినీతి, తప్పిదాలకు సంబంధించిన వివిరాలు ఉన్న ''రెడ్ డెయిరీ" విషయంలో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ రాజీనామా చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా డిమాండ్ చేశారు. ఎరుపు పేరు వింటేనే సీఎం బెంబేలెత్తిపోతున్నారని అన్నారు.
జైపూర్: రాజస్థాన్ ప్రభుత్వ అవినీతి, తప్పిదాలకు సంబంధించిన వివిరాలు ఉన్న ''రెడ్ డెయిరీ" విషయంలో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot) రాజీనామా చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit shah) డిమాండ్ చేశారు. ఎరుపు పేరు వింటేనే సీఎం బెంబేలెత్తిపోతున్నారని అన్నారు. డెయిరీ రంగు ఎరుపని, కానీ అందులో చీకటి పనుల వ్యవహారాలున్నాయని, కోట్లాది రూపాయల అవినీతి చోటుచేసుకుందని ఆరోపించారు. రాజస్థాన్‌లోని గంగాపూర్ సిటీలో శనివారంనాడు జరిగిన 'సహకార్ కిసాన్ సమ్మేళన్'లో ఆమిత్‌షా ఈ వ్యాఖ్యలు చేశారు. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని, బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ బడ్జెట్ 6 రెట్లు పెంచిందని, కోఆపరేటివ్స్‌కు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిందని అన్నారు.
మీరేం చేయలేరు..!
'సహకార్ కిసాన్ సమ్మేళన్'లో కొందరు వ్యక్తులు నినాదాలు చేయడంపై అమిత్‌షా మాట్లాడుతూ, నినిదాలు ఇమ్మంటూ కొందరు వ్యక్తులను పంపినంత మాత్రన గెహ్లాట్ సాధించిందేమీ ఉండదని, ఇప్పటికైనా సిగ్గనిపిస్తే 'రెడ్ డెయిరీ' అంశంపై ఆయన రాజీనామా చేసి ఎన్నికలను ఎదుర్కోవాలని సవాలు చేశారు.
రెడ్ డెయిరీ వ్యవహారం ఏమిటి?
మంత్రి పదవి నుంచి గెహ్లాట్ తొలగించిన రాజేంద్ర గుధ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. గెహ్లాట్ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలున్న రెడ్ డెయిరీని 2020లో ఆదాయం పన్ను దాడుల సమయంలో కాంగ్రెస్ నేత ధర్మేంద్ర రాథోడ్ నివాసం నుంచి తాను సీఎం ఆదేశాల మేరకు తేవడం జరిగిందని చెప్పారు. కాగా, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివర్లో జరుగనున్న నేపథ్యంలో ''రెడ్ డెయిరీ'' అంశాన్ని బీజేపీ తరచు ప్రస్తావిస్తోంది.
Updated Date - 2023-08-26T19:36:29+05:30 IST