Manipur debate: ఉభయ సభల విపక్ష నేతలకు అమిత్‌షా లేఖ
ABN, First Publish Date - 2023-07-25T19:48:39+05:30
మణిపూర్ హింసపై చర్చిందేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ ఉభయసభల విపక్ష నేతలకు లేఖ రాసినట్టు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తెలిపారు. మంగళవారంనాడు లోక్‌సభకు ఈ విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ, చర్చకు సహకరించేందుకు వారు (విపక్షాలకు) సముఖంగా లేరని, దళితులపై కానీ, మహిళల సంక్షేమంపై కానీ ఏమాత్రం ఆసక్తి లేదని విమర్శించారు.
న్యూఢిల్లీ: మణిపూర్ హింస (Manipur Violence)పై చర్చిందేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ ఉభయసభల విపక్ష నేతలకు లేఖ రాసినట్టు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తెలిపారు. మంగళవారంనాడు లోక్‌సభకు ఈ విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ, చర్చకు సహకరించేందుకు వారు (విపక్షాలకు) సముఖంగా లేరని, దళితులపై కానీ, మహిళల సంక్షేమంపై కానీ ఏమాత్రం ఆసక్తి లేదని విమర్శించారు. అయినప్పటికీ మరోసారి తాను మణిపూర్‌పై సమగ్ర చర్చకు సిద్ధమంటూ ఉభయసభల ప్రతిపక్ష నేతలకు లేఖ రాశానని చెప్పారు. చర్చ విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి భయం లేదని, చర్చలో ఎవరు పాల్గొన్నా స్వాగతిస్తామని అన్నారు.
''మాకు ఏ విషయం దాచిపెట్టాల్సిన అవసరం లేదు. మేము ఎన్నికలకు సైతం వెళ్తాం. ప్రజలు మిమ్మల్ని గమన్నిస్తున్నారు. మణిపూర్ వంటి సున్నిత అంశంపై చర్చకు అనువైన వాతావరణాన్ని కల్పించండి'' అని విపక్షాలను ఉద్దేశించి హోం మంత్రి అన్నారు.
లోక్‌సభలో విపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గేకు రాసిన లేఖను ట్విట్టర్‌లో అమిత్‌షా షేర్ చేశారు. మణిపూర్ అంశంపై చర్చ సజావుగా జరిగేందుకు పార్టీలకు అతీతంగా అందరూ సహకరించాలని ఆ ట్వీట్‌లో కోరారు. మణిపూర్ హింసపై పార్లమెంటులో ప్రధాన మంత్రి మాట్లాడాలని పట్టుబడుతున్న విపక్ష పార్టీలు ఇదే విషయమై మోదీపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నారనే వార్తల నేపథ్యంలో విపక్ష నేతలకు అమిత్‌షా లేఖలు రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Updated Date - 2023-07-25T19:48:39+05:30 IST