ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Apple Hacking Alert: హ్యాక్ అలర్ట్ మెసేజ్‌పై యాపిల్ సంస్థ క్లారిటీ.. అది నకిలీ అలర్ట్ కావొచ్చు

ABN, First Publish Date - 2023-10-31T16:56:18+05:30

మంగళవారం ఐఫోన్‌లకు వచ్చిన ఒక సందేశం.. దేశ రాజకీయాల్లో పెను దుమారమే రేపింది. ఎందుకంటే.. అది మామూలు మెసేజ్ కాదు, హ్యాకింగ్ అలర్ట్ మెసేజ్. అది కూడా విపక్ష నేతల ఎంపీలకు ఈ అలర్ట్ రావడంతో..

మంగళవారం ఐఫోన్‌లకు వచ్చిన ఒక సందేశం.. దేశ రాజకీయాల్లో పెను దుమారమే రేపింది. ఎందుకంటే.. అది మామూలు మెసేజ్ కాదు, హ్యాకింగ్ అలర్ట్ మెసేజ్. అది కూడా విపక్ష నేతల ఎంపీలకు ఈ అలర్ట్ రావడంతో.. రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ మెసేజ్ రాగానే ఆందోళనకు గురైన ఎంపీలు.. వెంటనే మీడియా ముందుకొచ్చి ‘తమ ఫోన్లను కేంద్ర ప్రభుత్వం హ్యాక్ చేసేందుకు ప్రయత్నిస్తోంద’ని ఆరోపణలు గుప్పించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే హ్యాకర్ల ద్వారా ఈ పని చేయిస్తుందంటూ కేంద్ర ప్రభుత్వంపై భగ్గుమన్నారు. ఇలా ఈ వ్యవహారం వివాదాస్పదం కావడంతో.. ఐఫోన్‌ తయారీ సంస్థ యాపిల్‌ స్పందించింది. హ్యాకింగ్‌ ప్రయత్నమేమీ జరగలేదని, ఇది నకిలీ అలర్ట్ అయ్యుండొచ్చని పేర్కొంది.


‘‘కొన్ని వార్నింగ్ ఆపిల్ నోటిఫికేషన్లు నకిలీవి అయ్యుండొచ్చు. ఈ తరహా అలర్ట్‌ నోటిఫికేషన్లను.. అధికారికంగా పనిచేసే హ్యాకర్ల పనిగా ఏమాత్రం ఆపాదించలేము. ఎందుకంటే.. స్టేట్-స్పాన్సర్డ్ హ్యాకర్లు హ్యాకింగ్‌ చేసేందుకు అధునాతన పద్ధతులను అవలంభిస్తారు. ఇందుకు అవసరమైన నిధులు, టెక్నాలజీ వారికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయి. ఇలాంటి దాడులను గుర్తించడమనేది నిఘా సంకేతాలపై ఆధారపడి ఉంటుంది. కొన్ని నోటిఫికేషన్లు నకిలీవి అయినా అయ్యుండొచ్చు లేదా కొన్ని ఎటాక్స్ గుర్తించబడవు’’ అని యాపిల్ సంస్థ తన ప్రకటనలో తెలిపింది. అయితే.. ఆ హ్యాక్‌ అలర్ట్‌ మెసేజ్‌లు ఎందుకు వచ్చాయన్న రహస్యాన్ని రివీల్ చేసేందుకు యాపిల్ సంస్థ నిరాకరించింది. ఒకవేళ ఆ కారణాల్ని బయటపెడితే.. భవిష్యత్తులో హ్యాకర్లు తమ నిఘా నుంచి తప్పించుకునే అవకాశముందని స్పష్టం చేసింది. కేవలం విపక్ష నేతలకే కాదని.. ప్రపంచంలోని 150 దేశాల్లోని పలువురి ఐఫోన్ యూజర్లకు కూడీ ఈ అలర్ట్ నోటిఫికేసన్ వచ్చినట్టు యాపిల్ సంస్థ వెల్లడించింది.

ఇదిలావుండగా.. కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌, ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చద్దా, శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది, టీఎంసీ ఎంపీ మహువా మెయిత్రాతో పాటు పలువురు విపక్ష పార్టీల నేతల ఐఫోన్లకు ఈ హ్యాకింగ్ అలర్ట్ మెసేజ్ వచ్చింది. ఇది వచ్చిన వెంటనే వాళ్లు స్క్రీన్‌షాట్ తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, కేంద్రం తమ ఫోన్లను హ్యాక్ చేస్తోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్రంపై ధ్వజమెత్తారు. ఎన్ని ఫోన్లు ట్యాప్ చేసినా తాము భయపడేది లేదని, తన ఫోన్ కూడా తీసుకోవాలని అన్నారు. మరోవైపు.. విపక్ష నేతలు చేస్తున్న ఈ ఆరోపణల్ని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ కొట్టిపారేశారు. ఒక్కోసారి నకిలీ అలర్ట్‌లు వస్తుంటాయని స్వయంగా యాపిల్ సంస్థ పేర్కొందని, దీనిపై తాను సమగ్ర సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఆదేశించామన్నారు. ఇందుకు సహకరించాలని విపక్ష నేతల్ని కోరారు.

Updated Date - 2023-10-31T16:56:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising