Jammu and Kashmir : సెలవుపై ఇంటికెళ్లి, అదృశ్యమైన సైనికుడు
ABN, First Publish Date - 2023-07-30T15:55:09+05:30
ఈద్ పండుగ జరుపుకోవడం కోసం ఇంటికి సెలవుపై వెళ్లిన సైనికుడు జావేద్ అహ్మద్ అనూహ్యంగా అదృశ్యమయ్యారు. జమ్మూ-కశ్మీరు లైట్ ఇన్‌ఫాంట్రీ రెజిమెంట్‌లో రైఫిల్‌మేన్‌గా పని చేస్తున్న ఆయన ఈ నెల 31న తిరిగి విధుల్లో చేరవలసి ఉంది. అయితే ఆయన శనివారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో తన కారులో సమీపంలోని మార్కెట్‌కు వెళ్లారు.
శ్రీనగర్ : ఈద్ పండుగ జరుపుకోవడం కోసం ఇంటికి సెలవుపై వెళ్లిన సైనికుడు జావేద్ అహ్మద్ అనూహ్యంగా అదృశ్యమయ్యారు. జమ్మూ-కశ్మీరు లైట్ ఇన్‌ఫాంట్రీ రెజిమెంట్‌లో రైఫిల్‌మేన్‌గా పని చేస్తున్న ఆయన ఈ నెల 31న తిరిగి విధుల్లో చేరవలసి ఉంది. అయితే ఆయన శనివారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో తన కారులో సమీపంలోని మార్కెట్‌కు వెళ్లారు. ఆయన ఎంతకీ తిరిగి రాకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు రాత్రి 9 గంటల నుంచి వెతకడం ప్రారంభించారు.
కుల్గాం జిల్లాకు చెందిన జావేద్ అహ్మద్ (25) కారులో రక్తపు మరకలు కనిపించడంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర విచారంతో విలపిస్తున్నారు. కశ్మీరు పోలీసులు కొందరు అనుమానితులను అరెస్ట్ చేసి, ప్రశ్నిస్తున్నారు. భద్రతా దళాలు ఆయన కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. ఆయనను ఉగ్రవాదులు అపహరించి ఉంటారని ఆయన కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. ఆయనను వెంటనే విడుదల చేయాలని వేడుకుంటూ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
‘దయచేసి మమ్మల్ని క్షమించండి. మా అబ్బాయిని వదిలిపెట్టండి. నా జావేద్‌ను విడుదల చేయండి. వాడిని సైన్యంలో పని చేయనివ్వను. దయచేసి వదిలిపెట్టండి’ అని జావేద్ తల్లి హృదయ విదారకంగా విలపిస్తూ ఈ సందేశాన్ని విడుదల చేశారు.
జావేద్ తండ్రి మహ్మద్ అయూబ్ వనీ మాట్లాడుతూ, తన కుమారుడిని లడఖ్‌లో నియమించారని తెలిపారు. ఈద్ తర్వాత ఆయన ఇంటికి సెలవుపై వచ్చారని, ఈ నెల 31న తిరిగి విధుల్లో చేరవలసి ఉందని చెప్పారు. ఆయన శనివారం సాయంత్రం మార్కెట్‌కు వెళ్లి, తిరిగి రాలేదన్నారు. ఆయనను కొందరు అడ్డగించి, అపహరించారని తెలిపారు. ‘‘మా అబ్బాయిని విడుదల చేయాలని వారిని కోరుతున్నాను’’ అని చెప్పారు.
సైన్యంలో పని చేసేవారిలో కొందరిని ఉగ్రవాదులు గతంలో అపహరించి, హత్య చేసిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి :
Gujarat : అహ్మదాబాద్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. 100 మంది రోగుల తరలింపు..
Moscow : మాస్కోపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి.. దెబ్బతిన్న రెండు భవనాలు..
Updated Date - 2023-07-30T15:55:09+05:30 IST