ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Arvind Kejriwal: దమ్ముంటే దేశం పేరు మార్చండి.. బీజేపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన కేజ్రీవాల్

ABN, First Publish Date - 2023-09-16T19:06:29+05:30

గత కొన్ని రోజుల నుంచి దేశం పేరు మార్పపై దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రపతి భవన్‌లో జీ20 దేశాధినేతలకు పంపిన ఆహ్వానాలపై ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ముద్రించడం...

గత కొన్ని రోజుల నుంచి దేశం పేరు మార్పపై దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రపతి భవన్‌లో జీ20 దేశాధినేతలకు పంపిన ఆహ్వానాలపై ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ముద్రించడం, జీ20 సదస్సుల్లో ప్రధాని మోదీ నేమ్‌ప్లేట్‌పై ‘భారత్’ అని రాసి ఉండటంతో.. దేశం పేరుని ఇండియా నుంచి భారత్‌గా మార్చనున్నారని బలమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తాజాగా స్పందిస్తూ బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ భారతదేశం మీ బాబుదా అంటూ మండిపడ్డ ఆయన.. దమ్ముంటే దేశం పేరు మార్చాలని సవాల్ విసిరారు.


ఛత్తీస్‌గఢ్‌లోని లాల్‌బాఘ్ గ్రౌండ్‌లో నిర్వహించిన ఓ బహిరంగ సభలో కేజ్రీవాల్ అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘‘ఈ దేశం ఏమైనా మీ బాబుదా? ఈ దేశం 140 కోట్ల ప్రజలకు చెందినది. ఇండియా మా గుండెల్లో ఉంది, హిందుస్తాన్ మా గుండెల్లో ఉంది, మా భరతమాతను మేము ఎంతగానో ప్రేమిస్తాం. దేశం పేరు మార్చాలని నేను బీజేపీకి ఛాలెంజ్ చేస్తున్నాను. గతేడాది వరకూ బీజేపీ వాళ్లు ప్రతీ కార్యక్రమాన్ని ‘ఇండియా’ పేరుతోనే నిర్వహించారు’’ అని చెప్పుకొచ్చారు. అనంతరం జమ్మకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ ఆపరేషన్‌లో నలుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఈ ఆపరేషన్‌పై మోదీ మౌనంగా ఉన్నారని మండిపడ్డారు. అసలెందుకు మాట్లాడటం లేదు? మీకు బాధగా అనిపించడం లేదా? అని ప్రశ్నించారు.

పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడమే తమ పార్టీ లక్ష్యమని చెప్పిన కేజ్రీవాల్.. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా, ఇప్పటివరకూ ఏ రాజకీయ పార్టీ కూడా విద్య గురించి మాట్లాడలేదన్నారు. కానీ తాము పేదరికాన్ని నిర్మూలించేలా పిల్లలను విద్యావంతులుగా మార్చాలనుకుంటున్నామని ఆయన చెప్పారు. తాము అధికారంలోకి వస్తే.. ఛత్తీస్‌గఢ్‌లో ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందజేస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు.

Updated Date - 2023-09-16T19:06:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising