ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Arvind Kejriwal: హోలీకి దూరంగా...మెడిటేషన్‌లో సీఎం.. ఎందుకంటే..?

ABN, First Publish Date - 2023-03-08T18:58:55+05:30

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారంనాడు హోలీ వేడుకలకు దూరంగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) హోలీ (Holi) వేడుకలకు దూరంగా ఉన్నారు. దేశం కోసం ప్రార్థన (Pray for the Country) చేస్తూ బుధవారంనాడు ఏడు గంటల సేపు ధ్యానంలో గడిపారు. ఉదయం 10 గంటలకు ఆయన ధ్యానంలో కూర్చుకున్నారు. కేజ్రీవాల్‌ మెడిటేషన్ చేస్తున్న ఫోటోను 'ఆప్' షేర్ చేసింది. ''ఈరోజు దేశం కోసం కేజ్రీవాల్ ప్రార్థిన చేస్తున్నారు'' అని అందులో తెలిపింది.

మెడిటేషన్‌కు ముందు కేజ్రీవాల్ రాజ్‌ఘాట్‌లోని మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. దేశం కోసం మంచి పనులు చేస్తున్నవారిని అరెస్టు చేస్తున్నారని కేజ్రీవాల్ మంగళవారంనాడు ఓ వీడియో సందేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. సత్యేంద్ర జైన్, మనీష్ సిసోడియాలకు అరెస్టుల నేపథ్యంలో హోలీ వేడుకలకు తాను దూరంగా ఉండదలచుకున్నానని, మెడిటేషన్‌లో కూర్చుంటానని చెప్పారు. దేశ పరిస్థితి చాలా బాధాకరంగా ఉందని, దేశం కోసం తాను మెడిటేషన్‌ చేయనున్నట్టు తెలిపారు.

సిసోడియా, జైన్‌లను జైలుకు పంపిన వారు అదానీపై మాత్రం చర్యలు తీసుకోలేదంటూ కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ''ప్రజలకు మంచి విద్య, ఆరోగ్య సదుపాలు కల్పిస్తున్న వారిని జైలుకు పంపుతూ, దేశాన్ని దోచుకుంటున్న వారికి మద్దతుగా నిలుస్తున్న ప్రధానమంత్రి ఉన్న దేశంలో ఉన్నాం. ఇది బాధాకరం. ఇందుకోసం మెడిటేషన్ చేసి, దేశం కోసం ప్రార్థిస్తాను. మీరు కూడా మోదీ తప్పు చేశారన్న భావనతోనూ, దేశం కోసం బాధపడుతూ ఉంటే హోలి సెలబ్రేట్ చేసుకున్న తర్వాత కొంత సమయం దేశం కోసం ప్రార్థించండి'' అని కేజ్రీవాల్ ఆ వీడియో సందేశంలో ప్రజలను కోరారు.

సత్యేంద్ర జైన్, సిసోడియా జైలులో ఉన్నందుకు తాను బాధపడటం లేదని, వారు ధైర్యవంతులే కాకుండా ఇప్పటికే దేశానికి తమ జీవితాలను ఫణంగా పెట్టారని, దేశంలో చేటుచేసుకుంటున్న ప్రస్తుత పరిస్థితులే తనకు బాధ కలిగిస్తున్నాయని సీఎం చెప్పారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సత్యేంద్ర జైన్‌ను 2022 మేలో అరెస్టు చేయగా, ఈ ఏడాది ఫిబ్రవరి 26న మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసి

Updated Date - 2023-03-08T19:01:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising