ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kejriwal turns Emotional: సిసోడియాను తలుచుకుని కేజ్రీవాల్ కంటతడి

ABN, First Publish Date - 2023-06-07T14:32:25+05:30

ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఔటర్ ఢిల్లీ బవానాలోని దిరియాపూర్ గ్రామంలో బుధవారం జరిగిన స్కూల్ ఆఫ్ స్పెషలైజ్డ్ ఎక్స్‌‍లెన్స్ కార్యక్రమంలో ఒక్కసారిగా భావోద్వోగానికి గురయ్యారు. విద్యారంగంలో మాజీ విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా చేసిన సేవలను, పడిన కష్టాన్ని తలుచుకుని కంటతడి పెట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఔటర్ ఢిల్లీ బవానాలోని దిరియాపూర్ గ్రామంలో బుధవారం జరిగిన స్కూల్ ఆఫ్ స్పెషలైజ్డ్ ఎక్స్‌‍లెన్స్ కార్యక్రమంలో ఒక్కసారిగా భావోద్వోగానికి గురయ్యారు. విద్యారంగంలో మాజీ విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా (Manish Sisodia) చేసిన సేవలను, పడిన కష్టాన్ని తలుచుకుని కంటతడి పెట్టారు.

''సిసోడియాపై బీజేపీ తప్పుడు కేసులు బనాయించి ఆయనను జైలులో పెట్టించింది. ఆయన మంచి పాఠశాలలు నిర్మించకుండా ఉంటే ఆయనను బీజేపీ జైలులో పెట్టించేది కాదు. విద్యారంగంలో విప్లవానికి చరమగీతం పాడాలని వారు కోరుకుంటున్నారు. అయితే విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు మేము తెరపడనీయం'' అని కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ విద్యారంగంలో సిసోడియా చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ ఒక్కసారిగా సీఎం భావోద్వేగానికి గురయ్యారు. విద్యారంగాన్ని ఎంతో గొప్పగా తీర్చిదిద్దాలనేది మనీష్ కల అని, దేశరాజధానిలోని పిల్లలందరికీ మంది విద్యను అందించాలని ఆయన కోరుకునే వారని కేజ్రీవాల్ చెప్పారు.

ఢిల్లీ ఎక్సైజ్ పాలజీ కుంభకోణంలో ఫిబ్రవరి 26న సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది. దీంతో ఆయన ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ దరఖాస్తును ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. ఆయనపై ఉన్న ఆరోపణల తీవ్రత దృష్యా బెయిలుకు నిరాకరించింది. అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్న భార్యను చూసేందుకు మాత్రం ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకూ రెండు సార్లు ఆయనకు హైకోర్టు అనుమతి ఇచ్చింది.

Updated Date - 2023-06-07T14:32:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising