ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Asaduddin Owaisi: స్వలింగ వివాహంపై సుప్రీంకోర్టు తీర్పు మీద అసదుద్దీన్ ఒవైసీ బాంబ్.. వివాహాన్ని కోర్టులు నిర్ణయించవంటూ..

ABN, First Publish Date - 2023-10-17T22:28:37+05:30

స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించలేమంటూ మంగళవారం సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పుపై తాజాగా ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ షాకింగ్ వ్యాఖ్యలు...

స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించలేమంటూ మంగళవారం సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పుపై తాజాగా ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటరీ ఆధిపత్య సూత్రాన్ని సుప్రీంకోర్టు సమర్థించిందని.. అయినా ఏ చట్టం ప్రకారం ఎవరిని వివాహం చేసుకోవాలన్న విషయం కోర్టులు నిర్ణయించవని ట్విటర్ (X ప్లాట్‌ఫామ్) మాధ్యమంగా ఆయన చెప్పుకొచ్చారు.


పెళ్లి అనేది కేవలం ఒక పురుషుడు, మహిళ మధ్య మాత్రమే జరుగుతుందని తన విశ్వాసం, మనస్సాక్షి చెబుతున్నాయని అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. ఇది 377 కేసు లాగా డీక్రిమినైజేషన్ ప్రశ్న కాదని, ఇది వివాహానికి సంబంధించిన గుర్తింపు గురించి అని వివరించారు. ప్రత్యేక వివాహ చట్టం, వ్యక్తిగత చట్టం ప్రకారం.. ట్రాన్స్‌జెండర్లు వివాహం చేసుకోవచ్చని బెంచ్ చేసిన వ్యాఖ్యల పట్ల తాను ఆందోళన చెందుతున్నానని ఒవైసీ ఆ ట్వీట్‌లో తెలిపారు. ఇస్లాం మతంలో ఇది సరైన వివరణ కాదన్నారు. ఎందుకంటే.. ఇద్దరు బయోలాజికల్ మేల్స్ (మగవాళ్లు) లేదా బయోలాజికల్ ఫీమేల్స్ (మహిళలు) మధ్య వివాహాన్ని ఇస్లాం గుర్తించదని తెలిపారు. ప్రత్యేక వివాహ చట్టంలోని లింగ-తటస్థ వివరణ కొన్నిసార్లు సమర్థించబడకపోవచ్చని, మహిళలకు అనాలోచిత దుర్బలత్వాలకు దారి తీయొచ్చని జస్టిస్ భట్ చేసిన వ్యాఖ్యలను ఏకీభవిస్తానని ఒవైసీ చెప్పుకొచ్చారు.

ఇంతకీ స్వలింగ సంపర్కుల వివాహ అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటి?

ప్రత్యేక వివాహ చట్టంలోని సెక్షన్ 4 ప్రకారం.. స్వలింగ సంపర్కుల వివాహాన్ని చట్టబద్ధం చేయాలని పిటిషనర్లు డిమాండ్ చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. స్వలింగ సంపర్కుల వివాహాన్ని గుర్తించేందుకు నిరాకరించింది. సుప్రీం కోర్టు ప్రకారం.జ వివాహం కూడా ప్రాథమిక హక్కుల వర్గం వెలుపల పరిగణించబడుతుంది. స్వలింగ సంపర్కాన్ని చట్టబద్ధం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించలేమని కోర్టు పేర్కొంది. ప్రభుత్వం కోరుకుంటే.. స్వలింగ సంపర్కుల ఆందోళనలను పరిశీలించడానికి ఒక కమిటీని వేయవచ్చని కోర్టు తెలిపింది.

Updated Date - 2023-10-17T22:28:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising