ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ashok Gehlot: మేజిక్ పని చేస్తుంది, బీజేపీ అడ్రస్ లేకుండా పోతుంది.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు అశోక్ గెహ్లాట్ కౌంటర్

ABN, First Publish Date - 2023-11-22T16:16:11+05:30

రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకరిపై మరొకరు ఆరోపణలు, విమర్శలతో దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే.. రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తాజాగా ప్రధాని మోదీ...

Rajasthan Elections: రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకరిపై మరొకరు ఆరోపణలు, విమర్శలతో దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే.. రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తాజాగా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తనని పదే పదే ‘మాంత్రికుడు’ అని పిలవడంపై ఆయన స్పందిస్తూ.. ఈసారి ఎన్నికల్లో తప్పకుండా తన మాయాజాలం పని చేస్తుందని, రాష్ట్రం నుంచి బీజేపీ అడ్రస్ లేకుండా పోతుందని ధ్వజమెత్తారు. ఇదే సమయంలో రెడీ డైరీ ఇష్యూతో పాటు ఎన్నికల హామీల గురించి కూడా మాట్లాడారు.

ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలేంటి?

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల రాజస్థాన్‌లో నిర్వహించిన ర్యాలీలో.. మాంత్రికుడు అయిన అశోక్ గెహ్లాట్‌కు ఈసారి ఓటు వేయకూడదని రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకున్నారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఒకవైపు భారత్ ప్రపంచంలో అగ్రగామిగా ఎదుగుతుంటే.. మరోవైపు రాజస్థాన్‌‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని గత ఐదేళ్లలో అవినీతి, అల్లర్లు, నేరాల్లో కాంగ్రెస్ అగ్రగామిగా నిలిపిందని ఆరోపించారు. ముఖ్యంగా.. మహిళలు, దళితులపై అత్యధికంగా నేరాలు జరిగాయన్నారు. అల్లర్లు, రాళ్ల దాడి, కర్ఫ్యూల కారణంగా.. రాజస్థాన్ రాష్ట్ర ప్రజలు హిందూ పండగలు శాంతియుతంగా జరుపుకోలేకపోయారన్నారు. అందుకే ఈసారి ఓటు వేయకూడదని ప్రజలు నిర్ణయించారని, ఎన్నికల తర్వాత కాంగ్రెస్ మాయం అవుతుందని జోస్యం చెప్పారు.


అశోక్ గెహ్లాట్ కౌంటర్ ఎటాక్

ప్రధాని మోదీ వ్యాఖ్యలపై అశోక్ గెహ్లాట్ స్పందిస్తూ.. ‘‘ఈసారి మాయాజాలం తప్పకుండా పని చేస్తుంది. రాజస్థాన్ నుంచి కాంగ్రెస్ మాయం అవుతుందని మోదీ చెప్పారు. కానీ.. ఎవరు మాయం అవుతారో మేం చెప్తాం’’ అని విరుచుకుపడ్డారు. కన్హయ్య లాల్ హత్య కేసును ఎన్నికల అంశంగా మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డ ఆయన.. హంతకులకు బీజేపీతో సంబధాలు ఉన్నాయని ఆరోపించారు. నిందితులకు ఈపాటికే ఉరి తీయాల్సిందని, కానీ ఎన్నికల దృష్ట్యా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) చేపట్టిన విచారణ ముందుకు సాగడం లేదని, అందుకే ఈ కేసు ఆలస్యమవుతూ వస్తోందని దుయ్యబట్టారు. రాజస్థాన్ పోలీసులు ఈ కేసుని డీల్ చేసి ఉంటే, ఈ పాటికే కేసు తుది దశకు చేరుకునేదని అన్నారు.

కన్హయ్య లాల్ ఘటన జరిగిన వెంటనే రాజస్థాన్ రాజస్థాన్ పోలీసులు రెండు గంటల్లోనే నిందితుల్ని అరెస్టు చేశారని.. కానీ ఈ కేసుని ఎన్‌ఐఏ స్వాధీనం చేసుకుందని అశోక్ గెహ్లాట్ పేర్కొన్నారు. ఈ ఘటన తర్వాత బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కలిసి మతపరమైన అల్లర్లు జరకుండా పని చేస్తారని తాను ఊహించానన్నారు. ఈ ఘటన జరిగినప్పుడు తాను వెంటనే తన కార్యక్రమాలను రద్దు చేసుకొని, కేసుపై పూర్తి దృష్టి పెట్టానన్నారు. కానీ.. బీజేపీ నాయకులు మాత్రం హైదరాబాద్‌లో సమావేశానికి వెళ్లారని గుర్తు చేశారు. ప్రస్తుతం అస్సాం గవర్నర్‌గా ఉన్న గులాబ్ చంద్ కటారియా అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ ఘటన జరిగిందన్నారు. ఈ కేసులో ఎన్‌ఐఏ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తమకు చెప్పడం లేదని కన్హయ్య లాల్ కుటుంబం చెబుతోందని ఆయన తెలిపారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా.. బీజేపీ లేవనెత్తిన ‘రెడ్ డైరీ’ ఇష్యూ ఏమాత్రం అర్థం లేనిదని అశోక్ గెహ్లాట్ అభివర్ణించారు. తమ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక అవకతవకల పాల్పడిందని వాళ్లు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని తిప్పికొట్టారు. ఒకవేళ వాళ్లు చేస్తున్న ఆరోపణల్లో ఏదైనా వాస్తవం ఉంటే.. అప్పుడు ఆ రెడ్ డైరీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) లేదా సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈసారి కూడా తమ కాంగ్రెస్ పార్టీనే రాజస్థాన్‌లో అఖండ విజయం సాధిస్తుందని, డిసెంబర్ 3వ తేదీన ఫలితాలు వచ్చాక బీజేపీ ఈ రాష్ట్రం నుంచి కనిపించకుండా మాయం అవ్వడం ఖాయమని అశోక్ గెహ్లాట్ ధీమా వ్యక్తం చేశారు.

Updated Date - 2023-11-22T16:16:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising