Gehlot Vs Pilot: వదంతులు సృష్టించే వారితో ప్రమాదం.. పైలట్‌పై గెహ్లాట్ విసుర్లు
ABN, First Publish Date - 2023-05-14T16:45:59+05:30
జైపూర్: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఆయన మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ మధ్య దూరం అంతకంతకూ పెరుగుతోంది. గెహ్లాట్ నేత సోనియాగాంధీ కాదని, వసుంధరా రాజే అని సచిన్ పైలట్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై గెహ్లాట్ ఘాటుగా స్పందించారు. వసుంధరా రాజేతో తాను కముక్కయ్యానంటూ కొందరు వదంతులు సృషిస్టున్నారని, అలాంటివారు చాలా ప్రమాదకారులని అన్నారు.
జైపూర్: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ (Ashok Gehot), ఆయన మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ (Sachin Pilot) మధ్య దూరం అంతకంతకూ పెరుగుతోంది. గెహ్లాట్ నేత సోనియాగాంధీ కాదని, వసుంధరా రాజే (Vasundhara Raje) అని సచిన్ పైలట్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై గెహ్లాట్ ఘాటుగా స్పందించారు. వసుంధరా రాజేతో తాను కముక్కయ్యానంటూ కొందరు వదంతులు సృషిస్టున్నారని, అలాంటివారు చాలా ప్రమాదకారులని అన్నారు. గత పదిహేనేళ్లలో తాను వసుంధరా రాజేతో మాట్లాడిన సందర్భాలు ఓ డజను మాత్రమే ఉంటాయని చెప్పారు.
రాజస్థాన్‌లోని నాగౌర్‌లో జరిగిన ఓ ర్యాలీలో గెహ్లాట్ మాట్లాడుతూ, వసంధరా రాజేకు, తనకు మధ్య ఎలాంటి సంబంధ బాంధవ్యాలు లేవన్నారు. ''దీనిపై కొందరు వదంతలు వ్యాప్తి చేస్తున్నారు. అలాంటి వ్యక్తులు చాలా ప్రమాదకారులు. రాజకీయాల్లో పోరాటం అనేది సిద్ధాంతాలు, విధానాలపై ఉంటాయనే విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు'' అని గెహ్లాట్ అన్నారు.
అవినీతికి సంబంధించిన అంశంపై రాజస్థాన్‌లో సొంత ప్రభుత్వం (కాంగ్రెస్)పైనే సచిన్ పైలట్ ఇటీవల ఒకరోజు నిరాహార దీక్ష జరపారు. ప్రస్తుతం ఐదురోజుల 'జన్ సంఘర్ష్ పాదయాత్ర' జరుపుతున్నారు. పాదయాత్ర సందర్భంలో ఆయన గెహ్లాట్‌పై తాజా ఆరోపణలు చేశారు. గెహ్లాట్ నాయకురాలు సోనియాగాంధీ కాదని, వసుంధరా రాజే అన్నట్టుగా కనిపిస్తోందని చెప్పారు. దీనికి ముందే గెహ్లాట్ ఒక సభలో మాట్లాడుతూ, ఇటీవల తన ప్రభుత్వాన్ని కుప్పకూల్చేందుకు ప్రయత్నాలు జరిగాయని, అప్పుడు వసుంధరా రాజే, కొందరు ఎమ్మెల్యేలు తనకు మద్దతుగా నిలిచారని అన్నారు. ఆయన వ్యాఖ్యలను వసుంధరా రాజే వెంటనే ఖండించారు. 2023 ఎన్నికల్లో ఓటమి భయంతోనే గెహ్లాట్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, గెహ్లాట్ తనను అవమానించిన్నట్టు ఏ ఒక్క నేత కూడా ఇంతలా అవమానించలేదని అన్నారు. ఈ క్రమంలోనే గెహ్లాట్‌పై పైలట్ విమర్శలు గుప్పించారు. వసుంధరా రాజే హయాంలో బీజేపీ ప్రభుత్వం జరిగిన అవినీతిపై విచారణ జరపాలని తాను ఎన్నిసార్లు కోరినా గెహ్లాట్ పట్టించుకోవడం లేదని, ఆయన చేసిన తాజా వ్యాఖ్యలు చేస్తుంటే ఆయన నాయకురాలు సోనియాగాంధీ కాదని, వసుంధరా రాజే ఆయన నేత అనే అభిప్రాయం కలుగుతోందని అన్నారు.
Updated Date - 2023-05-14T16:47:07+05:30 IST