ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Price hike : ధరల పెరుగుదలకు కారణం మియా ముస్లింలే : హిమంత బిశ్వ శర్మ

ABN, First Publish Date - 2023-07-15T09:06:42+05:30

కూరగాయల ధరలు పెరగడానికి కారణం మియా ముస్లింలేనని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Assam chief minister Himanta Biswa Sarma) అన్నారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో కూరగాయల ధరలు తక్కువగా ఉన్నాయని, గువాహటిలో మాత్రం భారీగా పెంచేశారని చెప్పారు.

Himanta Biswa Sarma, Asaduddin Owaisi
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : కూరగాయల ధరలు పెరగడానికి కారణం మియా ముస్లింలేనని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Assam chief minister Himanta Biswa Sarma) అన్నారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో కూరగాయల ధరలు తక్కువగా ఉన్నాయని, గువాహటిలో మాత్రం భారీగా పెంచేశారని చెప్పారు. మియా ముస్లింలు బంగ్లాదేశ్ మూలాలుగలవారని తెలిపారు. శర్మ వ్యాఖ్యలను ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా ఖండించారు.

ఏఐయూడీఎఫ్ చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్ అంతకుముందు మాట్లాడుతూ, మియా ముస్లింలు లేకపోతే అస్సాం అసంపూర్ణంగా మిగిలిపోతుందన్నారు. దీనిపై హిమంత బిశ్వ శర్మ స్పందిస్తూ, నేడు కూరగాయల అమ్మకందారుల్లో అత్యధికులు, రిక్షా నడిపేవారు, బస్సు డ్రైవర్లు, ఓలా, ఊబర్ డ్రైవర్లు మియా ముస్లింలేనని చెప్పారు. స్థానిక అస్సామీ యువత వారితో పోటీ పడాలన్నారు. స్థానిక అస్సామీ యువత ఆ ఉద్యోగాలను చేయాలన్నారు. కూరగాయల ధరలు పెరగడానికి కారణం మియా ముస్లింలేనని, గ్రామీణ ప్రాంతాల్లో కూరగాయల ధరలు తక్కువగా ఉన్నాయని, గువాహటిలో మాత్రం భారీగా పెంచేశారని చెప్పారు.

శర్మ వ్యాఖ్యలపై ఒవైసీ స్పందిస్తూ, ఏ తప్పు జరిగినా ప్రతిదానికీ మియా ముస్లింలను నిందించే ఓ వర్గం ఈ దేశంలో ఉందన్నారు. గేదె పాలు ఇవ్వకపోయినా, కోడి గుడ్డు పెట్టకపోయినా మియా ముస్లింలనే నిందిస్తారన్నారు. వ్యక్తిగత వైఫల్యాలకు కూడా వారినే నిందిస్తారన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విదేశీ ముస్లింలతో గాఢమైన స్నేహాన్ని ఏర్పరచుకుంటున్నారన్నారు. వారిని టమాటాలు, బంగాళాదుంపలు, బచ్చలి కూర అడగండని సలహా ఇచ్చారు.

మోదీ ఇటీవల ఈజిప్టును సందర్శించారు. ఆయనకు ఆ దేశ అత్యున్నత పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ది నైల్’ను ఆ దేశాధ్యక్షుడు అబ్డెల్ ఫట్టాహ్ ఎల్-సిసి అందజేశారు.

ఇవి కూడా చదవండి :

BJP state president: బీజేపీ రాష్ట్ర చీఫ్ సంచలన ప్రకటన.. ఈ నెలాఖరులో ‘డీఎంకే అవినీతి చిట్టా-2’

Bombay High Court: చీమను చంపడానికి సుత్తిని తెస్తారా..?

Updated Date - 2023-07-15T09:06:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising