Himanta Sarma: అసోం సీఎంకు అసోం కాంగ్రెస్ ప్రివిలేజ్ నోటీసు
ABN, First Publish Date - 2023-03-30T12:39:29+05:30
అసోం రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత శర్మపై అస్సాం కాంగ్రెస్ పార్టీ ప్రివిలేజ్ నోటీసును దాఖలు చేసింది...
గువహటి (అసోం): అసోం రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత శర్మపై అస్సాం కాంగ్రెస్ పార్టీ ప్రివిలేజ్ నోటీసును దాఖలు చేసింది.(Assam Congress)అసెంబ్లీలో చర్చ సందర్భంగా సీఎం హిమంత శర్మ(Himanta Sarma) తప్పుడు ప్రకటన చేశారని అసోం కాంగ్రెస్ పేర్కొంది.రాహుల్ గాంధీ లోక్‌సభకు అనర్హత వేటుపై చర్చ సందర్భంగా రాష్ట్ర అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యల్లో ఒకదానిపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మపై కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది.కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ అసోం అసెంబ్లీ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత సీఎం శర్మ సభలో తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు.
ఇది కూడా చదవండి : Philippine: ఫిలిప్పీన్స్ ఓడలో అగ్నిప్రమాదం...12 మంది మృతి
అయితే కాంగ్రెస్ మాత్రం ప్రివిలేజ్ నోటీసును(Privilege Notice) ఇంకా ఉపసంహరించుకోలేదు.ముఖ్యమంత్రి శర్మ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.అంతకుముందు రోజు కోర్టు తీర్పుతో లోక్‌సభకు రాహుల్ గాంధీ అనర్హతపై చర్చించడానికి కాంగ్రెస్ వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత అసోం అసెంబ్లీలో గందరగోళం నెలకొంది.
Updated Date - 2023-03-30T13:05:08+05:30 IST