Indian Railways : రైలు టిక్కెట్ కేన్సిల్ చేసుకుంటున్నారా?... ఇది తెలుసుకోండి...!
ABN, First Publish Date - 2023-02-19T15:51:54+05:30
రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw) పార్లమెంటుకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో, ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం
న్యూఢిల్లీ : రైల్వే ఈ-టిక్కెట్ల కేన్సిలేషన్, కన్వీనియెన్స్ ఫీ ద్వారా భారతీయ రైల్వేలకు పెద్ద మొత్తంలో ఆదాయం లభిస్తోంది. ఈ-టిక్కెట్లు, కంప్యూటరైజ్డ్ పాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS) కౌంటర్ల ద్వారా జారీ చేసే టిక్కెట్లను రద్దు చేసుకున్నపుడు కొంత ఫీజును రైల్వేలు వసూలు చేస్తాయనే సంగతి తెలిసిందే. ఈ ఫీజును కేన్సిలేషన్ లేదా క్లియరేజ్ ఛార్జ్ అంటారు. రైల్వే పాసింజర్స్ రూల్స్, 2015 ప్రకారం దీనిని విధిస్తారు.
రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw) పార్లమెంటుకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో, ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఈ-టికెటింగ్ ప్లాట్‌ఫాం ద్వారా ఆన్‌లైన్ రిజర్వుడు ఈ-టిక్కెట్లను బుక్ చేసుకున్న ప్రయాణికుల నుంచి కన్వీనియెన్స్ రుసుమును వసూలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ-టిక్కెట్లతో సహా రైల్వే ప్రయాణ టిక్కెట్లను రద్దు చేసుకున్నపుడు 2019-20 నుంచి 2022 డిసెంబరు వరకు రూ.1,949.98 కోట్లు వసూలు చేసినట్లు చెప్పారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో కౌంటర్, ఈ-టికెట్ల రద్దు వల్ల రూ.694.08 కోట్లు వచ్చినట్లు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో 2022 డిసెంబరు వరకు టికెట్ల కేన్సిలేషన్ ద్వారా రూ.604.40 కోట్లు వచ్చినట్లు తెలిపారు. ఎయిర్ కండిషన్డ్ తరగతిలో ప్రయాణించడం కోసం రైలు టికెట్‌ను నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు ద్వారా బుక్ చేసుకుని, దానిని ఆ తర్వాత రద్దు చేసుకుంటే, ప్రతి టిక్కెట్‌కు రూ.30 చొప్పున వసూలు చేస్తున్నట్లు తెలిపారు. యూపీఐ (Unified Payments Interface) ద్వారా బుక్ చేసుకున్న టికెట్‌ను రద్దు చేసుకుంటే, ప్రతి టిక్కెట్‌కు రూ.20 వసూలు చేస్తున్నట్లు తెలిపారు.
నాన్ ఏసీ తరగతుల్లో ప్రయాణించడం కోసం తీసుకున్న టిక్కెట్‌ను రద్దు చేసుకోవాలంటే, దానిని నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు ద్వారా బుక్ చేసుకుంటే, ప్రతి టికెట్‌కు రూ.15 చొప్పున వసూలు చేస్తున్నట్లు తెలిపారు. యూపీఏ ద్వారా బుక్ చేసుకున్న టిక్కెట్‌ను రద్దు చేయడానికి ప్రతి టికెట్‌కు రూ.10 వసూలు చేస్తున్నట్లు చెప్పారు.
టికెట్‌ను రద్దు చేసుకునేటపుడు కన్వీనియెన్స్ ఫీజును వసూలు చేయడం లేదని చెప్పారు. రైల్వేలు ఎప్పటికప్పుడు జారీ చేసే సూచనల ప్రకారం ఐఆర్‌సీటీసీ కేన్సిలేషన్ లేదా కన్వీనియెన్స్ ఛార్జీలను వసూలు చేస్తుందన్నారు.
ప్రస్తుతం ప్రతి నిమిషానికి 25,000 టికెట్లను బుక్ చేసే సామర్థ్యం రైల్వేలకు ఉందన్నారు. దీనిని నిమిషానికి 2.25 లక్షలకు పెంచాలన్నది తమ లక్ష్యమని తెలిపారు. దీని కోసం సాఫ్ట్‌వేర్‌ను తీసుకొచ్చినట్లు చెప్పారు.
ప్రస్తుతం నిమిషానికి 40 వేల విచారణల (enquires)కు సమాధానం చెప్పే సామర్థ్యం రైల్వేలకు ఉందని, రానున్న రోజుల్లో ఈ సంఖ్యను నాలుగు లక్షలకు పెంచేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.
ఇవి కూడా చదవండి :
BJP Vs JDU : నితీశ్ కుమార్‌పై మండిపడ్డ రవిశంకర్ ప్రసాద్
Updated Date - 2023-02-19T15:51:58+05:30 IST