ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ED: మనీలాండరింగ్ కేసులో సంచలనం.. కీలక నేత పేరును ప్రస్తావించిన ఈడీ

ABN, Publish Date - Dec 28 , 2023 | 10:59 AM

ఎన్‌ఆర్‌ఐ వ్యాపారవేత్త సీసీ తంపితో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీ వాద్రా(PriyankaGandhi Vadra) పేరును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) ఇవాళ తొలిసారి ప్రస్తావించింది.

ఢిల్లీ: ఎన్‌ఆర్‌ఐ వ్యాపారవేత్త సీసీ తంపితో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీ వాద్రా(PriyankaGandhi Vadra) పేరును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) ఇవాళ తొలిసారి ప్రస్తావించింది. ఈ కేసుకు సంబంధించి ఇటీవలే ఛార్జ్ షీట్‌లో ఆమె భర్త రాబర్ట్ వాద్రా(Robert Vadra) పేరును ఈడీ పేర్కొంది.

ED తన ప్రకటనలో.. “కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా, కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ ఏజెంట్ ద్వారా హర్యానాలో భూమిని కొనుగోలు చేశారు. రాబర్ట్ వాద్రా వ్యాపారవేత్త తంపికి ఆ భూమిని విక్రయించాడు" అని తెలిపింది. ఆయుధ వ్యాపారి, పరారీలో ఉన్న సంజయ్ భండారీపై ఉన్న ఈడీ కేసులో రాబర్ట్ వాద్రా చిక్కుకున్నారు.


రాబర్ట్ వాద్రాతోపాటు సంజయ్ భండారీ సన్నిహితులు తంపి, సుమిత్ చద్దాలపై ఈడీ ఢిల్లీ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. సీసీ థంపి యూఏఈకి చెందిన ఎన్ఆర్ఐ, సుమిత్ చద్దా లండన్ లో నివసిస్తున్నాడు. ఈడీ వీరిరువురిని అరెస్టు చేశారు. నిందితులు సీసీ థంపీ, రాబర్ట్ వాద్రాల మధ్య డబ్బు లావాదేవీలే కాకుండా లండన్‌లో ఉన్న 12 బ్రయాన్‌స్టన్ స్క్వేర్ ఫ్లాట్‌ను సీసీ థంపి రాబర్ట్ వాద్రా కోరిక మేరకు పునరుద్ధరించారని ఈడీ కోర్టుకు తెలిపింది.

లండన్‌లోని 12 బ్రయాన్‌స్టన్ స్క్వేర్, 6 గ్రోస్వెనర్ హిల్ కోర్ట్, లండన్‌తో సహా అనేక అప్రకటిత విదేశీ ఆస్తులను సంజయ్ భండారీ కలిగి ఉన్నట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. ఈ రెండు ఆస్తుల్ని నేరపూరితంగా వచ్చిన ఆదాయం నుంచి పొందారు. సీసీ థంపి, సుమిత్ చద్దా ఈ నేరాల ద్వారా సంపాదించిన ఆస్తులను దాచిపెట్టి వినియోగించుకున్నట్లు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటి వరకు సంజయ్ భండారీకి చెందిన రూ.26.55 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది.

Updated Date - Dec 28 , 2023 | 10:59 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising