Pakistan : బలూచిస్థాన్‌లో చైనీస్ ఇంజినీర్ల వాహనాలపై కాల్పులు
ABN, First Publish Date - 2023-08-13T13:59:29+05:30
పాకిస్థాన్‌లో పని చేస్తున్న చైనీస్ ఇంజినీర్లు ప్రయాణిస్తున్న వాహనాలపై ఆదివారం భీకర దాడి జరిగింది. నౌకాశ్రయ నగరం గదర్ పేలుళ్లు, కాల్పుల మోతతో దద్దరిల్లింది. రెండు గంటలపాటు కాల్పులు జరిగాయి. దీంతో రోడ్లపై రాకపోకలను నిలిపేశారు. ఈ దాడిని ప్రభుత్వ అధికారులు ధ్రువీకరించారు.
న్యూఢిల్లీ : పాకిస్థాన్‌లో పని చేస్తున్న చైనీస్ ఇంజినీర్లు ప్రయాణిస్తున్న వాహనాలపై ఆదివారం భీకర దాడి జరిగింది. నౌకాశ్రయ నగరం గదర్ పేలుళ్లు, కాల్పుల మోతతో దద్దరిల్లింది. రెండు గంటలపాటు కాల్పులు జరిగాయి. దీంతో రోడ్లపై రాకపోకలను నిలిపేశారు. ఈ దాడిని ప్రభుత్వ అధికారులు ధ్రువీకరించారు.
పాకిస్థాన్ మీడియా కథనాల ప్రకారం, చైనీస్ ఇంజినీర్ల వాహనాలపై దాడి బలూచిస్థాన్‌లోని గదర్ నగరం, ఫకీర్ కాలనీలో ఆదివారం ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైంది. సుమారు రెండు గంటలపాటు కాల్పులు, పేలుళ్లు జరిగాయి.
ఈ దాడికి తమదే బాధ్యత అని బలూచ్ లిబరేషన్ ఆర్మీకి చెందిన ఆత్మాహుతి దళం మజీద్ బ్రిగేడ్ ప్రకటించింది. మరోవైపు పాకిస్థాన్‌లోని చైనీస్ కాన్సులేట్లు స్పందిస్తూ, బలూచిస్థాన్, సింధ్ ప్రావిన్సులలోని చైనా పౌరులు తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకు ఇళ్లలోనే ఉండాలని తెలిపాయి.
పాకిస్థాన్‌కు చైనా అన్నివిధాలుగానూ మిత్ర దేశం. బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని తిరుగుబాటు సంస్థలు చైనా పెట్టుబడులు, చైనా జాతీయులపై తరచూ దాడులు చేస్తున్నాయి.
ఇవి కూడా చదవండి :
Ashwini Vaishnaw : టెక్నాలజీని ప్రజాస్వామికీకరణ చేయాలనేది మోదీ ఆకాంక్ష : అశ్విని వైష్ణవ్
Canada : ప్రముఖ హిందూ దేవాలయాన్ని అపవిత్రం చేసిన ఖలిస్థానీలు
Updated Date - 2023-08-13T13:59:29+05:30 IST