ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bangalore: డీకే శివకుమార్‌ సంచలన ఆదేశాలు.. ఆ వివాదాల్లో అస్సలు రాజీ పడొద్దు..

ABN, First Publish Date - 2023-08-04T12:30:30+05:30

కృష్ణ, కావేరి, మహదాయి తదితర అంతర్‌ రాష్ట్ర జలవివాదాల విషయంలో రాష్ట్రానికి న్యాయం దక్కేంతవరకు పోరాడాలని న్యాయనిపుణులకు జలవనరుల శాఖను

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): కృష్ణ, కావేరి, మహదాయి తదితర అంతర్‌ రాష్ట్ర జలవివాదాల విషయంలో రాష్ట్రానికి న్యాయం దక్కేంతవరకు పోరాడాలని న్యాయనిపుణులకు జలవనరుల శాఖను నిర్వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌(Deputy Chief Minister DK Shivakumar) దిశానిర్దేశం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన గురువారం జల వివాదాలపై సుప్రీంకోర్టులో వాదిస్తున్న న్యాయనిపుణులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పలు వివాదాల తాజా స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. కేసులు విచారణకు వచ్చినప్పుడు సమగ్ర సమాచారంతో సిద్ధంగా ఉండాలని న్యాయనిపుణులను కోరారు. ఇదే సందర్భంగా న్యాయనిపుణులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ సమావేశంలో లోక్‌సభ సభ్యుడు డీకే సురేష్‌, ఢిల్లీ కర్ణాటక అధికార ప్రతినిధి టీబీ జయచంద్ర, సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది మోహన్‌ కాతరకి, కర్ణాటక జలవనరుల శాఖ అదనపు ముఖ్య కార్యదర్శి రాకే్‌షసింగ్‌, సాంకేతిక సలహాదారుడు జయప్రకాష్‌, బీబీఎంపీ కమిషనర్‌ తుషార్‌ గిరినాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-04T12:30:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising