ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bangalore: గంటల్లోనే 17 శాతం వేతనాలు పెంచిన ప్రభుత్వం

ABN, First Publish Date - 2023-03-02T13:03:00+05:30

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వేతన పెంపు విషయంలో పట్టుబట్టడంతో గంటల వ్యవధిలోనే సర్కారు దిగివచ్చింది. వేతన పెంపు, పాత పెన్షన్‌, ఏడో వేతన కమిషన్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

- పాత పెన్షన్‌ విధానంపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు

- రాష్ట్రమంతటా స్తంభించిన వ్యవస్థలు

- కార్యక్రమాలన్నీ రద్దు చేసుకున్న సీఎం

- ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చలు

- ఆందోళన విరమించి విధుల్లో చేరిన ఉద్యోగులు

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వేతన పెంపు విషయంలో పట్టుబట్టడంతో గంటల వ్యవధిలోనే సర్కారు దిగివచ్చింది. వేతన పెంపు, పాత పెన్షన్‌, ఏడో వేతన కమిషన్‌ అమలు వంటి డిమాండ్లతో దాదాపు మూడు నెలలుగా ప్రభుత్వాన్ని ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు. వారి డిమాండ్లపై సానుకూలత లభించకపోవడంతో మార్చి 1 నుంచి నిరవధిక సమ్మెకు వెళతామని హెచ్చరించారు. అందుకు అనుగుణంగానే బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. మంగళవారం ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయేదాకా రాజధాని బెంగళూరు(Bangalore)తోపాటు జిల్లా కేంద్రాల్లో ఉద్యోగులు సమ్మెలో వ్యవహరించాల్సిన విధానాలపై ప్రణాళికలు సిద్ధం చేశారు. మరో రెండు నెలల్లో శాసనసభ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఉద్యోగుల సమ్మె ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టింది. శక్తికేంద్రం విధానసౌధ, వికాససౌధ, బెళగావిలోని సువర్ణసౌధతోపాటు జిల్లాలవారీగా ఉండే మినీ విధానసౌధలు ఉద్యోగులు లేక వెలవెలబోయాయి. ప్రభుత్వ విద్యాసంస్థలు మూసివేయడంతో లక్షలాది మంది విద్యార్థులు పాఠశాలలు, కళాశాలల దాకా వచ్చి వెనుతిరిగారు. ఆసుపత్రిలో ఓపీడీ సేవలు నిలిపివేయడంతో సాధారణ వైద్యం కోసం వచ్చిన వారు తంటాలుపడ్డారు. ఇన్‌పేషెంట్లు, అత్యవసర రోగులకు మాత్రమే వైద్యులు చికిత్సలు అందించారు.

ప్రతి ఆసుపత్రి వద్ద రోగులు బారులు తీరారు. రాష్ట్ర పాలనా వ్యవస్థ స్తంభించడంతో ప్రభుత్వం డైలమాలో పడింది. ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై(Chief Minister Basavaraj Bommai) ముందస్తుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. అందుబాటులో ఉండే మంత్రులతో కలసి విధానసౌధకు చేరుకున్నారు. ఆర్థికశాఖ నిపుణులు, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు షడాక్షరితోపాటు ముఖ్యనేతలతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. మధ్యాహ్నమయ్యేసరికి 17 శాతం వేతనాలు పెంచేలా ముఖ్యమంత్రి బొమ్మై నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని మీడియాకు వెల్లడించారు. అయితే ఉత్తర్వులు రికార్డు రూపంలో వస్తేనే నేతలంతా కలసి ఓ నిర్ణయం తీసుకుంటామని షడాక్షరి ప్రకటించారు. సీఎం ప్రకటించిన కాసేపటికే ఉత్తర్వులు విడుదల చేశారు. 17 శాతం వేతనాలు పెంచుతూ ఆదేశాలు జారీ చేశారు. ఏప్రిల్‌ 2023 నుంచే కొత్త వేతనం

అమలులోకి వస్తుందని ప్రకటించారు. పాత పెన్షన్‌ విధానంపై ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు అంగీకరించారు. ఇప్పటికే ఏడో వేతన కమిషన్‌ విషయమై ఓ కమిటీ ఉన్నందున ఉత్తర్వులు వచ్చాక నిర్ణయం తీసుకుంటామని సీఎం వెల్లడించారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని ఉద్యోగ సంఘం నేతలు పేర్కొన్నారు. ముఖ్యనేతలు అధ్యక్షుడు షడాక్షరి నేతృత్వంలో విధానసౌధలో చర్చలు జరిపి సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించారు. ఉద్యోగులు విధానసౌధలో విధులకు హాజరయ్యారు. జిల్లాలవారీగా గురువారం నుంచి యథావిధిగా అన్ని వ్యవస్థలు పనిచేయనున్నాయి. ఒక్క రోజులోనే సమస్య పరిష్కరించి కార్యాలయాలు పని చేయడంతో ప్రజలు హర్హం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-03-02T13:03:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!