ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bangalore Metro: లాభాల బాటలో బెంగళూరు మెట్రో

ABN, First Publish Date - 2023-08-23T09:55:05+05:30

బెంగళూరు మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (Bangalore Metro Rail Corporation Limited) 2023-24 ఆర్థిక సంవత్సరం లో రూ. 100 కోట్ల లాభాన్ని

- రూ. 100 కోట్లు దాటే అవకాశం

- ఉచిత బస్సు ప్రయాణంతో తగ్గిన మహిళల సంఖ్య

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): బెంగళూరు మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (Bangalore Metro Rail Corporation Limited) 2023-24 ఆర్థిక సంవత్సరం లో రూ. 100 కోట్ల లాభాన్ని సాధించే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయని అధికారులు వెల్లడించారు. గార్డెన్‌సిటీ బెంగళూరులో మెట్రో రైళ్ల సేవలు ప్రారంభమయ్యాక దశాబ్దం తర్వాత 2022-23 ఆర్థిక సంవత్సరంలో లాభాల బాట పట్టింది. టికెట్లు, ఇతర మార్గాల ద్వారా బీఎంఆర్‌సీఎల్‌ 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ. 594.02 కోట్ల లాభం గడించింది. ఇదే సమయంలో సిబ్బంది జీత భత్యాలు, నిర్వహణ కోసం రూ. 486.61 కోట్లు ఖర్చు చేసింది. ఖర్చులు పోగా నికర లాభం రూ. 40 కోట్లుగా నమోదైంది. కొవిడ్‌ సమయంలో మెట్రో రైళ్ల సేవలను నిలిపేయడంతో నష్టాలు చవిచూడాల్సి వచ్చిందని అధికారులు అంటున్నారు. ప్రస్తుత ఏడాది ఏప్రిల్‌ నుం చి జూలై నాటికి టికెట్ల రూపంలో బీఎంఆర్‌సీఎల్‌కు రూ. 170.58 కోట్ల ఆదాయం లభించగా అద్దెలు తదితర సేవల ద్వా రా రూ. 20.09 కోట్ల ఆదాయం గడించింది. ఇదే సమయంలో నిర్వహణ కోసం రూ. 186.92 కోట్లు ఖర్చుపెట్టింది.

నగర మెట్రో రైళ్లలో గత ఏడాది ప్రతిరోజూ సగటున 5.32 లక్షల మంది ప్రయాణించగా ప్రస్తుత ఏడాది ఈ సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రతిరోజూ 6.3 లక్షల మంది మెట్రో రైళ్లలో ప్రయాణిస్తున్నా రు. ఇక త్వరలో బయ్యప్పనహళ్లి-కేఆర్‌ పురం మధ్య 2.5 కిలో మీటర్ల దూరం, కింగేరి- చల్లఘట్ట మధ్య 1.9 కిలోమీటర్ల దూరం మెట్రోపనులు పూర్తయ్యాయి. ఈ మార్గంలో ట్రయల్‌ రన్స్‌(Trial runs) కూడా విజయవంతంగా సాగుతున్నాయి. ఈ రెండు మార్గాల్లో రైళ్ల సంచారం ప్రారంభమైతే బీఎంఆర్‌సీఎల్‌ ఆదాయం మరింతగా పె రిగే అవకాశం కనిపిస్తోంది. వచ్చే రెండుమూడు నెలల్లోనే మెట్రో రైళ్లలో ప్రయాణించే వారిసంఖ్య 7 లక్షలకు చేరుకోవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం అందుబాటులోకి వచ్చాక మెట్రో రైళ్లలో ప్రయాణించే మహిళల సంఖ్య 20 శాతం వరకు తగ్గిందని, లేనట్లయితే లాభాలు ఇంకా పెరిగి ఉండేవని అధికారులు అంటున్నారు. మొత్తానికి బీఎంఆర్‌సీఎల్‌ దశాబ్దం తర్వాత రూ. 100 కోట్ల మార్కు లాభాల స్థాయికి చేరుకోనుండటంతో అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రయాణికులకు మరిన్ని ఆఫర్లను ప్రకటించే ఆ లోచన ఉందని బీఎంఆర్‌సీఎల్‌ ఉన్నతాధికారి ఒకరు నగరంలో మంగళవారం మీడియాకు చెప్పారు.

Updated Date - 2023-08-23T09:55:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising