ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bangalore: కర్ణాటక ఎన్నికల్లో చిత్తుగా ఓడిన మంత్రులు వీరే...

ABN, First Publish Date - 2023-05-14T13:47:37+05:30

బీజేపీ ప్రభుత్వంలో కీలకులుగా వ్యవహరించిన మంత్రులు చిత్తుగా ఓడిపోయారు. బసవరాజ్‌ బొమ్మై కెబినెట్‌లో కీలక మంత్రులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): బీజేపీ ప్రభుత్వంలో కీలకులుగా వ్యవహరించిన మంత్రులు చిత్తుగా ఓడిపోయారు. బసవరాజ్‌ బొమ్మై కెబినెట్‌లో కీలక మంత్రులు 11 మంది ఓటమి చెందారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా వ్యవహరించిన డాక్టర్‌ సుధాకర్‌, భారీ పరిశ్రమల శాఖ మంత్రి మురుగేష్‌ నిరాణి, శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి మాధుస్వామి, రవాణాశాఖ మంత్రి శ్రీరాములు, క్రీడలు యువజనులశాఖ మంత్రి నారాయణగౌడ(Minister Narayana Gowda), స్త్రీ శిశుసంక్షేమ శాఖ మంత్రి హాలప్ప ఆచార్‌,. వ్యవసాయశాఖ మంత్రి బీసీ పాటిల్‌(BC Patil), గృహనిర్మాణశాఖ మంత్రి సోమణ్ణ రెండు నియోజకవర్గాల్లోనూ ఓటమి చెందారు. భారీ జలవనరులశాఖ మంత్రి గోవింద కారజోళ, మునిసిపల్‌ వ్యవహారాల శాఖ మంత్రి ఎంటీబీ నాగరాజ్‌, విద్యాశాఖ మంత్రి బీసీ నాగేష్ ఓడిపోయారు. కాగా రెవెన్యూశాఖ మంత్రి అశోక్‌, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ చేతిలో కనకపురలో చిత్తుగా ఓటమి చెందారు. డీకే శివకుమార్‌(DK Sivakumar) 1,22,391 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కానీ మంత్రి అశోక్‌ సొంత నియోజకవర్గం పద్మనాభనగర్‌లో విజయం సాధించారు. బొమ్మై కేబినెట్‌లో కీలక మంత్రులంతా ఓటమి చెందడం పార్టీకు కోలుకోలేని దెబ్బకొట్టినట్లయింది.

Updated Date - 2023-05-14T13:47:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising