Bengaluru: గృహలక్ష్మికి.. 1.10 కోట్ల దరఖాస్తులు
ABN, First Publish Date - 2023-08-25T11:15:37+05:30
ప్రతి గృహిణికి నెలకు రూ.2000 అందజేయనున్న ‘గృహలక్ష్మి’ గ్యారెంటీ పథకానికి 1.10కోట్ల దరఖాస్తులు అందాయని డీసీఎం
- 30న మైసూరులో పథకం ప్రారంభం
- హాజరు కానున్న అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ
- ఏర్పాట్లను పరిశీలించిన డీసీఎం డీకే శివకుమార్
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): ప్రతి గృహిణికి నెలకు రూ.2000 అందజేయనున్న ‘గృహలక్ష్మి’ గ్యారెంటీ పథకానికి 1.10కోట్ల దరఖాస్తులు అందాయని డీసీఎం డీకే శివకుమార్(DCM DK Shivakumar) తెలిపారు. ఈనెల 30న మైసూరు మహారాజ కళాశాల మైదానం వేదికగా పథకాన్ని ప్రారంభించనున్నారు. గురువారం డీసీఎం కళాశాల మైదానాన్ని పరిశీలించారు. మం త్రులు మహదేవప్ప, లక్ష్మీహెబ్బాళ్కర్, చలువరాయస్వామి, ఎమ్మెల్యే తన్వీర్‌సేఠ్‌లు పాల్గొన్నారు. ఇదే సందర్భంగా డీసీఎం మీడియాతో మాట్లాడుతూ గృహలక్ష్మి గ్యారెంటీను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీలు ముఖ్యులుగా పాల్గొంటారన్నారు. సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah) సహా పార్టీ ప్రముఖులంతా పాల్గొంటారన్నారు. మండ్య, మైసూరు, కొడుగు, హాసన్ జిల్లాల నుంచి ప్రజలు వస్తారని ఇందుకోసం రెండువేల బస్సులు సమకూరుస్తామన్నారు. కొందరు లబ్దిదారులు ఆన్‌లైన్ ద్వారాను మరికొందరు వేదికపై నుంచే అభిప్రాయాలు వ్యక్తం చేస్తారన్నారు. ఎమ్మెల్యేలు నరేంద్రస్వామి, అనిల్‌చిక్కమాదు, హరీష్ గౌడ, రవిశంకర్, దర్శన్‌దృవనారాయణలు పాల్గొన్నారు.
Updated Date - 2023-08-25T11:15:37+05:30 IST