Intranasal Covid Vaccine : భారతీయ కోవిడ్ టీకా రంగంలో మరో సంచలనం
ABN, First Publish Date - 2023-01-21T20:05:08+05:30
మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఈ ఫెస్టివల్ జరిగింది. ‘ఫేస్-టు-ఫేస్ విత్ న్యూ ఫ్రాంటియర్స్ ఇన్ సైన్స్’’ సెగ్మెంట్‌లో
భోపాల్ : మన దేశంలో తొలి ఇంట్రానాసల్ కోవిడ్-19 వ్యాక్సిన్ ఇంకోవాక్ (iNCOVACC)ను ఈ నెల 26న ఆవిష్కరించనున్నట్లు భారత్ బయోటెక్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ఎల్ల శనివారం ప్రకటించారు. పశువులకు సంక్రమించే లంపీ స్కిన్ వ్యాధికి దేశీయంగా తయారు చేసిన టీకా లంపి ప్రోవాక్ఇండ్ (Lumpi-ProVacInd)ను వచ్చే నెలలో ఆవిష్కరించే అవకాశం ఉందని తెలిపారు. ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ ఆయన ఈ వివరాలను తెలిపారు.
మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఈ ఫెస్టివల్ జరిగింది. ‘ఫేస్-టు-ఫేస్ విత్ న్యూ ఫ్రాంటియర్స్ ఇన్ సైన్స్’’ సెగ్మెంట్‌లో కృష్ణ ఎల్లా (Krishna Ella) పాల్గొని, విద్యార్థులతో మాట్లాడారు. గణతంత్ర దినోత్సవాల సందర్భంగా తమ నాసికా టీకాను అధికారికంగా ఆవిష్కరిస్తామని తెలిపారు.
భారత్ బయోటెక్ (Bharat Biotech) డిసెంబరులో ఈ నాసికా టీకా గురించి వెల్లడించింది. ప్రభుత్వానికి ఒక మోతాదును రూ.325కు అమ్ముతామని, ప్రైవేట్ వ్యాక్సినేషన్ సెంటర్లకు ఒక మోతాదు రూ.800 చొప్పున విక్రయిస్తామని తెలిపింది.
ఇంకోవాక్ (iNCOVACC)ను బూస్టర్ డోస్‌గా వాడేందుకు డిసెంబరులో ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వయసు 18 సంవత్సరాలు పైబడినవారికి దీనిని ఇవ్వవచ్చు.
Updated Date - 2023-01-21T20:05:12+05:30 IST