Karnataka Results: కర్ణాటక ఎన్నికలపై భారత్‌జోడో ప్రభావం
ABN, First Publish Date - 2023-05-13T21:18:01+05:30
బీజేపీ విద్వేష రాజకీయాలకు నిరసనగా, ప్రజల్లో శాంతిసామరస్యాలను నెలకొల్పేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) చేపట్టిన..
బెంగళూరు: బీజేపీ విద్వేష రాజకీయాలకు నిరసనగా, ప్రజల్లో శాంతిసామరస్యాలను నెలకొల్పేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) చేపట్టిన ‘భారత్‌జోడో’ యాత్ర కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో బాగానే ప్రభావం చూపింది. కర్ణాటక (Karnataka)లో రాహుల్‌గాంధీ యాత్ర 25 రోజులకు పైగా సాగింది. భారత్‌జోడో యాత్ర సాగిన 51 నియోజకవర్గాలకుగాను 36 చోట్ల కాంగ్రెస్ విజయం సాధించింది. ఈ నియోజకవర్గాల్లో బీజేపీ, జేడీఎస్ (BJP JDS) కంచుకోటలు కూడా ఉన్నాయి. విద్వేషపూరిత రాజకీయాలను.. శాంతి సామరస్యాలకు పేరు గడించిన కన్నడిగులు స్పష్టంగా తిప్పికొట్టారని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. కర్ణాటకలో అద్భుత విజయం అందుకున్న అనంతరం రాహుల్‌గాంధీ ఇదే అంశాన్ని ట్వీట్ చేశారు. కర్ణాటకలో ద్వేషపూరిత రాజకీయాల తలుపులు మూసుకుపోయాయని, ప్రేమపూరిత తలుపులు తెరుచుకున్నాయని ఆయన ట్వీట్ చేశారు. కాంగ్రెస్ రాష్ట్ర నేతలంతా రాహుల్ ట్వీట్‌కు పెద్దపెట్టున రీ ట్వీట్ చేయడం విశేషం.
Updated Date - 2023-05-13T21:18:10+05:30 IST