ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

China Vs India : చైనీస్ సిల్క్ రోడ్‌కు చెక్ పెట్టిన ఇండియన్ స్పైస్ రూట్

ABN, First Publish Date - 2023-09-10T12:46:34+05:30

చైనా తలపెట్టిన బెల్ట్-రోడ్-ఇనీషియేటివ్‌ ప్రారంభమై మరికొద్ది రోజుల్లో పదేళ్లు పూర్తి కావస్తోంది. ఈ సమయంలో భారత్, అమెరికా, యూఏఈ, సౌదీ అరేబియా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యూరోపియన్ యూనియన్ కలిసికట్టుగా చైనాకు గట్టి సవాల్ విసిరాయి.

న్యూఢిల్లీ : చైనా తలపెట్టిన బెల్ట్-రోడ్-ఇనీషియేటివ్‌ ప్రారంభమై మరికొద్ది రోజుల్లో పదేళ్లు పూర్తి కావస్తోంది. ఈ సమయంలో భారత్, అమెరికా, యూఏఈ, సౌదీ అరేబియా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యూరోపియన్ యూనియన్ కలిసికట్టుగా చైనాకు గట్టి సవాల్ విసిరాయి. భారత్-మిడిల్ ఈస్ట్-యూరోప్ ఎకనమిక్ కారిడార్ (IMEE-EC) కోసం అవగాహన పత్రంపై సంతకాలు చేశాయి. ఆర్థిక సమైక్యతను ప్రోత్సహించడం ద్వారా ఆసియా, యూరోప్ దేశాలను అనుసంధానం చేయడమే దీని లక్ష్యం.

చైనా స్పాన్సర్డ్ బీఆర్ఐ నుంచి జీ7 దేశాల్లో ఒకటైన ఇటలీ వైదొలగాలనుకుంటోంది. మరోవైపు గత కాలపు మిత్రుడు సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్‌తో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేతులు కలిపారు. వీరిద్దరి కలయిక వెనుక ప్రధాని మోదీ ప్రోత్సాహం ఉంది. భారత్-మిడిల్ ఈస్ట్-యూరోప్ ఎకనమిక్ కారిడార్ ప్రాజెక్టు ప్రమోటర్లలో యూఏఈ ప్రెసిడెంట్‌ ఒకరు. భారత్-యూరోప్ మధ్య ఆర్థిక రంగంలో వారథిగా అరేబియన్ ద్వీపకల్పం వ్యవహరించగలదని యూఏఈ విశ్వసిస్తోంది. ఎమ్మాన్యుయెల్ మేక్రన్ మద్దతుతో జర్మనీ, ఇటలీ, యూరోపియన్ కమిషన్ కూడా ఈ ప్రాజెక్టు కోసం చేతులు కలిపాయి.

మిడిల్ ఈస్ట్ కారిడార్లో రెండు వేర్వేరు కారిడార్లు ఉన్నాయి. ఫుజైరా నౌకాశ్రయం-భారత దేశంలోని ముంద్రా నౌకాశ్రయాలను ఈస్ట్ కారిడార్ అనుసంధానం చేస్తుంది. సౌదీ అరేబియా, జోర్డాన్ గుండా రైలు మార్గాన్ని ఉపయోగించుకుని స్టాండర్టయిజ్డ్ కంటెయినర్ల ద్వారా ఇజ్రాయెలీ పోర్టు హైఫాకు సరుకును రవాణా చేయవచ్చు.

వెస్ట్ కారిడార్ హైఫా నుంచి ప్రారంభమవుతుంది. ఇక్కడి నుంచి భారత దేశంలోని సరుకులు వివిధ నౌకాశ్రయాలకు, ఫ్రాన్స్‌లోని మర్సీల్లే, ఇటలీ, గ్రీస్ దేశాల్లోని ఇతర నౌకాశ్రయాలకు రవాణా చేయవచ్చు.

కొద్ది దూరం రైల్‌రోడ్డును సౌదీ అరేబియా నిర్మించవలసి ఉంది. ఇది మినహా మిగిలిన కారిడార్ సమీప భవిష్యత్తులోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వియత్నాం, థాయ్‌లాండ్, మయన్మార్, బంగ్లాదేశ్ వంటి దేశాలను అనుసంధానం చేస్తుంది కాబట్టి, దీనిని అందరూ కోరుకుంటున్నారు. చైనా పడగ నీడ నుంచి మయన్మార్ సైనిక పాలకులు తప్పించుకుంటే, ఈ కారిడార్ వల్ల ప్రయోజనం పొందవచ్చు.


ఇవి కూడా చదవండి :

CBN Arrest Case : ఏసీబీ కోర్టులో స్వయంగా వాదనలు వినిపించిన చంద్రబాబు.. ఏం చెప్పారంటే..?

CID On NCBN Remand Report : చంద్రబాబు రిమాండ్ రిపోర్టులో సీఐడీ ఏయే విషయాలు చెప్పింది.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎక్స్ క్లూజివ్

Updated Date - 2023-09-10T12:46:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising