ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

India Vs China : చైనాకు తెగేసి చెప్పిన భారత్

ABN, First Publish Date - 2023-04-28T15:27:16+05:30

సరిహద్దుల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటేనే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటాయని

India, China Defence Ministers meet
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : సరిహద్దుల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటేనే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటాయని చైనాకు భారత ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) చార్డింగ్ నింగ్లుంగ్ నుల్లా సెక్టర్ సహా దెమ్‌చోక్ ఏరియా, దౌలత్‌బేగ్ ఓల్డీ సెక్టర్‌లోని డెప్సాంగ్ ప్లెయిన్స్ వద్ద ఘర్షణ పరిస్థితులను నివారించాలని తెలిపింది. తూర్పు లడఖ్‌లోని సరిహద్దుల్లో ప్రస్తుతం ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ పరిస్థితులు ఉన్నాయని, ఈ పరిస్థితిని పీఎల్ఏ సాధారణ స్థితికి తీసుకురావాలని స్పష్టం చేసింది.

తూర్పు లడఖ్‌లోని సరిహద్దుల్లో సాధారణ స్థితి నెలకొందని, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు 2020 మే నెల ముందునాటి పరిస్థితికి మళ్లీ రావాలని భారత్, చైనా రక్షణ మంత్రుల సమావేశం, 18వ విడత మిలిటరీ డయలాగ్‌లలో చైనా భారత దేశాన్ని కోరింది. అయితే 2023 ఫిబ్రవరి 22న జరిగిన చైనా-భారత్ సరిహద్దు వ్యవహారాలపై సంప్రదింపులు, సమన్వయం కోసం వర్కింగ్ మెకానిజం సమావేశం అనంతరం చైనా విడుదల చేసిన స్టేట్‌మెంట్‌కు విరుద్ధంగా ప్రస్తుత డిమాండ్‌ ఉంది. సరిహద్దు పరిస్థితిని మరింత సడలించేందుకు తగిన ఇతర చర్యలపై ఇరు దేశాలు చర్చించినట్లు చైనా అప్పట్లో పేర్కొంది. సాధారణ నిర్వహణ, నియంత్రణ స్థితికి పరిస్థితి వచ్చే విధంగా కృషి చేయడానికి ఇరు దేశాలు అంగీకరించినట్లు తెలిపింది. దీని భావం ఏమిటంటే, తూర్పు లడఖ్‌లో బోర్డర్ మేనేజ్‌మెంట్ ఇప్పటికీ పరివర్తన చెందే దశలో ఉంది. డెప్సాంగ్, దెమ్‌చోక్‌లలో యథాతథస్థితిని పీఎల్ఏ పునరుద్ధరించిన తర్వాత మాత్రమే పరిస్థితి సాధారణ స్థితికి చేరుతుందని భావం.

డెప్సాంగ్, దెమ్‌చోక్ సమస్యలు వారసత్వంగా వచ్చినవని చైనా పీఎల్ఏ గతంలో చెప్పింది. 2020 మే నెలలో చైనా పీఎల్ఏ గాల్వన్, ఖుగ్రంగ్, గోగ్రా-హాట్‌స్ప్రింగ్స్, పాంగాంగ్ సో ప్రాంతాల్లో భారీగా ఉల్లంఘనలకు పాల్పడింది. ఈ రెండు ప్రాంతాల్లోనూ వెస్టర్న్ థియేటర్ కమాండ్ కట్టుదిట్టంగా మోహరించింది. 2020 మే నెలలో చైనా దురాక్రమణ యత్నాల తర్వాత సైన్యం అప్రమత్తమైంది. భారత్ స్పందిస్తూ, ఈ రెండు సమస్యలు పరిష్కారమయ్యే వరకు చైనాతో సంబంధాలు సాధారణ స్థితికి చేరబోవని స్పష్టం చేసింది. తూర్పు లడఖ్‌లోని 1,597 కిలోమీటర్ల పొడవున వాస్తవాధీన రేఖ వెంబడి ఇరు దేశాలు 50,000కుపైగా దళాలను మోహరించాయి. క్షిపణులు, రాకెట్లు, ఆర్టిలరీలను కూడా పెద్ద ఎత్తున మోహరించాయి.

భారత దేశం గతంలో మాదిరిగా కాకుండా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) నేతృత్వంలోని ప్రభుత్వం ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. వాస్తవాధీన రేఖ వెంబడి పరిస్థితి సాధారణ స్థితికి చేరితేనే చైనాతో సంబంధాల పునరుద్ధరణ జరుగుతుందని కుండ బద్దలు కొట్టినట్లు చెప్తోంది.

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చైనా రక్షణ మంత్రి జనరల్ లీ షాంగ్ఫుతో గురువారం సమావేశమైనపుడు కూడా కరాఖండీగా మాట్లాడారు. వాస్తవాధీన రేఖ వెంబడి ప్రశాంతత ఏర్పడితేనే ఇరు దేశాల మధ్య సత్సంబంధాల పునరుద్ధరణ జరుగుతుందని చెప్పారు.

ఇవి కూడా చదవండి :

Karnataka Elections: సోనియా విషకన్య ... బీజేపీ వివాదాస్పద వ్యాఖ్యలు

Manipur Violence: సీఎం సభా వేదికకు నిప్పు, సెక్షన్ 144 అమలు, ఇంటర్నెట్ సర్వీసులు నిలిపివేత

Updated Date - 2023-04-28T15:27:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising