ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

BJP CEC meeting: బీజేపీ కీలక సమావేశం.. ఖరారు కానున్న 2 రాష్ట్రాల అభ్యర్థులు

ABN, First Publish Date - 2023-10-01T20:41:02+05:30

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో అభ్యర్థుల పేర్లను ఖరారు చేసేందుకు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఆదివారం రాత్రి గంటలకు సమావేశమైంది. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ అభ్యర్థులను ఈ సమావేశంలో ఖరారు చేయనుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, జేపీ నడ్డా, అమిత్‌షా, ఇతర ఎన్నికల కమిటీ సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో అభ్యర్థుల పేర్లను ఖరారు చేసేందుకు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ (Central Election Committee) ఆదివారం రాత్రి 8 గంటలకు సమావేశమైంది. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ అభ్యర్థులను ఈ సమావేశంలో ఖరారు చేయనుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, జేపీ నడ్డా, అమిత్‌షా, ఇతర ఎన్నికల కమిటీ సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు.


పార్టీ ప్రధాన కార్యాలయానికి సాయంత్ర నుంచి ఆయా రాష్ట్రాలకు చెందిన పలువురు కీలక నేతలు చేరుకున్నారు. బీజేపీ నేత, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే, గజేంద్ర సింగ్ షెకావత్, ప్రహ్లాద్ జోషి, కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, భూపేంద్ర యాదవ్, కైలాష్ చైదరి తదితరులు వీరిలో ఉన్నారు


కాగా, రాజస్థాన్‌లో సుమారు 60 నుంచి 70 మంది సీట్లు, ఛత్తీస్‌గఢ్‌లో 31 సీట్లకు అభ్యర్థుల ఎంపికపై ఈ సమావేశంలో చర్చిస్తారని పార్టీ వర్గాల సమాచారం. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో పాగా వేయాలని కమలనాథులు గట్టి పట్టుదలగా ఉన్నారని చెబుతున్నారు. కాగా, అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఐదు రాష్ట్రాల్లోని సీట్లను ఎ,బి,సి,డి కేటగిరిలుగా బీజేపీ వర్గీకరించి వ్యూహరచన సాగిస్తోంది. బీజేపీ ప్రతిసారి గెలుస్తూ వస్తున్న సీట్లను కేటగిరి 'ఎ' గాను, గెలుపు ఓటముల మిశ్రమంగా ఉన్న సీట్లను కేటగిరి 'బి' గానూ వర్గీకరించింది. కేటగిరి 'సి'లో బలహీన మైన స్థానాలు ఉంటాయి. గత మూడు ఎన్నికల్లో బీజేపీ వరుసగా ఓడిపోతున్న నియోజకవర్గాలను కేటగిరి 'డి'గా బీజీపీ వర్గీకరిస్తోంది. ఇందుకు అనుగుణంగానే అభ్యర్థులను వ్యూహాత్మకంగా ఎంపిక చేసేందుకు పార్టీ సీఈసీ కసరత్తు చేస్తోంది.

Updated Date - 2023-10-01T20:41:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising