MCD Polls: ఎంసీడీ సమావేశంలో హనుమాన్ చాలీసా, జై శ్రీరామ్ నినాదాలు
ABN, First Publish Date - 2023-02-22T20:10:59+05:30
దేశ రాజధాని ఢిల్లీలో హోరాహోరీగా జరిగిన మేయర్ ఎన్నిక లో ఆప్ విజయం సాధించగా, ఎంసీడీ స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక ..సమయంలో అనూహ్య ఘటన
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో హోరాహోరీగా జరిగిన మేయర్ ఎన్నిక (Mayor Election)లో ఆప్ విజయం సాధించగా, ఎంసీడీ స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక సమయంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. బీజేపీ కౌన్సిలర్లు హనుమాన్ చాలీసా (Hanuman Chalisa) పఠిస్తూ, 'జై శ్రీరామ్' నినాదాలు హోరెత్తించారు. స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక విషయంలో జరుగుతున్న జాప్యానికి నిరసనగా కౌన్సిలర్లు నినాదాలకు దిగారు. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు రావడం, సోషల్ మీడియాలో కనిపించడంతో ఒక్కసారిగా వైరల్ అవుతోంది.
దీనికి ముందు, ఎంసీడీ మేయర్ అభ్యర్థిగా ఆమ్ ఆద్మీకి చెందిన షెల్లీ ఒబెరాయ్ విజయం సాధించారు. మొత్తం 266 ఓట్లు పోల్ కాగా, ఒబెరాయ్‌కు 150 ఓట్లు, బీజేపీ అభ్యర్థి రేఖా గుప్తాకు 116 ఓట్లు వచ్చాయి. షెల్లీ ఒబెరాయ్ విజయం సాధించగానే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అభినందనలు తెలిపారు. ఇది ప్రజావిజయమని, ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్‌ను గెలిపించిన కార్యకర్తలు, ప్రజలకు కృతజ్ఞతలని కేజ్రీవాల్, సిసోడియా ట్వీట్లు చేశారు. ఆమె తొలి మహిళా మేయర్ షెల్లీ ఒబెరాయ్‌కు అభినందనలు తెలిపారు.
Updated Date - 2023-02-22T20:11:09+05:30 IST