ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Karnataka Assembly elections: బీజేపీ నేత ఈశ్వరప్ప నిర్ణయంతో కలకలం

ABN, First Publish Date - 2023-04-11T15:28:44+05:30

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ సీనియర్ నాయకుడు కేఎస్ ఈశ్వరప్ప కీలక నిర్ణయం తీసుకున్నారు.

KS Eashwarappa
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ సీనియర్ నాయకుడు కేఎస్ ఈశ్వరప్ప కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్‌బై చెప్పాలనుకుంటున్నానని, శివమొగ్గ నుంచి పోటీ చేయబోనంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు లేఖ రాశారు. సాయంత్రానికి బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల కావొచ్చని ప్రచారం జరుగుతున్న సమయంలో ఈశ్వరప్ప నిర్ణయం కలకలం రేపుతోంది. నెల క్రితం ఆయన తాను ఈసారి శివమొగ్గనుంచి పోటీ చేయకపోవచ్చని చెప్పారు. అంతే కాదు ప్రజాసేవ చేయాలంటే ప్రజాప్రతినిధిగానే ఉండాల్సిన అవసరం లేదన్నారు. బీజేపీలో తన కుమారుడు కంటేశ్‌కు, తనకు ఇద్దరికీ టికెట్లు అసాధ్యమని ఆయన ముందే గ్రహించారు. అందుకే కుమారుడి భవిష్యత్ కోసం ఆయన ప్రత్యక్ష రాజకీయాలనుంచి తప్పుకున్నారని ప్రచారం జరుగుతోంది. 75 ఏళ్లకు పైబడినవారు రాజకీయాలనుంచి తప్పుకోవాలని బీజేపీలో నిబంధన ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నిబంధన ప్రకారమే ఆయన రాజకీయాలనుంచి తప్పుకుంటున్నట్లు తాజాగా ప్రకటించారు. అయితే కంటేశ్‌కు శివమొగ్గలోనే టికెట్ ఇస్తారా లేక మరోచోట ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఈశ్వరప్ప బీజేపీకి 4 దశాబ్దాలకు పైగా సేవలందించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా సేవలందించారు. కర్ణాటకలో ఈ ఎన్నికల్లో బీజేపీ 150 స్థానాల్లో గెలవబోతుందని ఈశ్వరప్ప జోస్యం చెప్పారు. జాతీయవాద ముస్లింలు బీజేపీ వెంటే ఉంటారని ఆయన చెప్పారు.

మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్ప కూడా ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు. తన కుమారుడు విజయేంద్ర కోసం యెడ్యూరప్ప తప్పుకున్నారని ప్రచారం జరిగింది. ఒకే కుటుంబం నుంచి రెండు టికెట్లు ఇచ్చే సంస్కృతి బీజేపీలో లేదని పరిశీలకులు చెబుతున్నారు. కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా బలంగా వాణి వినిపిస్తున్న బీజేపీ ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి టికెట్లను ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తోంది.

224మంది సభ్యులున్న కర్ణాటక అసెంబ్లీలో బీజేపీకి 119మంది, కాంగ్రెస్‌‌కు 75 మంది, జేడీఎస్‌కు 28మంది సభ్యులుండగా 2సీట్లు ఖాళీగా ఉన్నాయి.

కర్ణాటక (Karnataka)లో మే 10న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు మే 13న జరుగుతుందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది.

Sharad Pawar: శరద్ పవార్ వ్యూహాలతో కాంగ్రెస్‌లో కలకలం

Ghulam Nabi Azad: ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఆజాద్ గుబులు


Karnataka Assembly elections: బీజేపీ జాబితా విడుదల వేళ దుమారం

Updated Date - 2023-04-11T15:35:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising