BJP : యోగి ఆదిత్యనాథ్‌పై వరుణ్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2023-08-30T09:42:50+05:30
భారతీయ జనతా పార్టీ (BJP) అధిష్ఠానంతో ఆ పార్టీ ఎంపీ వరుణ్ గాంధీ (Varun Gandhi)కి సత్సంబంధాలు రాన్రానూ తగ్గుతున్నాయి. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాలపై ఆయన తరచూ ట్వీట్లు చేస్తూ తన అసమ్మతి గళాన్ని వినిపిస్తూ ఉంటారు.
లక్నో : భారతీయ జనతా పార్టీ (BJP) అధిష్ఠానంతో ఆ పార్టీ ఎంపీ వరుణ్ గాంధీ (Varun Gandhi)కి సత్సంబంధాలు రాన్రానూ తగ్గుతున్నాయి. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాలపై ఆయన తరచూ ట్వీట్లు చేస్తూ తన అసమ్మతి గళాన్ని వినిపిస్తూ ఉంటారు. అయినప్పటికీ ఆ పార్టీ అధిష్ఠానం ఆయనను పట్టించుకోవడం లేదు. చూసీ చూడనట్లు వ్యవహరిస్తోంది. తాజాగా ఆయన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు పరోక్షంగా గుచ్చుకునేలా ఓ వ్యాఖ్య చేశారు. ఈ సంఘటన ఆయన ఓ బహిరంగ సభలో మాట్లాడినపుడు జరిగింది.
వరుణ్ గాంధీ సోమవారం తన లోక్ సభ నియోజకవర్గం ఫిలిబిత్‌లో బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఆ సమయంలో ఆ సభలో పాల్గొన్న ఓ సాధువు ఫోన్ మోగింది. దీనిని గమనించిన వరుణ్ మాట్లాడుతూ, ఆ సాధువు ఫోన్‌ను స్విచాఫ్ చేయాలని ఎవరూ అడగవద్దని కార్యకర్తలను కోరారు.
‘‘దయచేసి ఆయనను ఆపవద్దు. ‘మహరాజ్ జీ ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారో ఎవరికి తెలుసు? అప్పుడు మనకు ఏం జరుగుతుందో?’’ అని వ్యంగ్యంగా అన్నారు.
ఈ వీడియో ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తోంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ఉద్దేశించి పరోక్షంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని కొందరు అంటున్నారు.
యోగి ఆదిత్యనాథ్ ఉత్తర ప్రదేశ్‌లోని గోరక్ష పీఠాధీశ్వరుడు అనే సంగతి తెలిసిందే. ఆయన నిరంతరం కాషాయ వస్త్రాలు ధరించి కనిపిస్తారు. ఆయన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మాఫియాపై విరుచుకుపడుతూ బుల్డోజర్ బాబాగా ప్రసిద్ధి పొందారు.
ఇవి కూడా చదవండి :
LPG Prices: ఎల్‌పీజీ ధర రూ.200 తగ్గింపు..
Kaveri: 15 రోజులు ‘కావేరి’ని వదలండి
Updated Date - 2023-08-30T09:42:50+05:30 IST