ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Karnataka: చెట్ల నరికివేత కేసులో ఎంపీ సోదరుడి అరెస్ట్.. కోట్ల విలువైన కలప స్వాధీనం

ABN, Publish Date - Dec 31 , 2023 | 11:48 AM

చెట్లను నరికివేసి అక్రమంగా రవాణా చేస్తున్నారన్న ఆరోపణలతో కర్ణాటక(Karnataka)లో ఓ ప్రజాప్రతినిధి సోదరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా సోదరుడు విక్రమ్ సింహా హాసన్ జిల్లాలోని కోట్ల రూపాయల విలువైన 126 చెట్లను నరికి ఇతర ప్రాంతాలకు తరలించాడు.

బెంగళూరు: చెట్లను నరికివేసి అక్రమంగా రవాణా చేస్తున్నారన్న ఆరోపణలతో కర్ణాటక(Karnataka)లో ఓ ప్రజాప్రతినిధి సోదరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా సోదరుడు విక్రమ్ సింహా హాసన్ జిల్లాలోని కోట్ల రూపాయల విలువైన 126 చెట్లను నరికి ఇతర ప్రాంతాలకు తరలించాడు.

సమాచారం అందుకున్నఅటవీ శాఖ పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దర్యాప్తు నిమిత్తం బెంగళూరు తరలించి కలపను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇటీవల జరిగిన పార్లమెంటు భద్రత ఉల్లంఘన కేసులో ఎంపీ ప్రతాప్ సింహా పాత్రపై ఆరోపణలు వినిపిస్తున్నాయి.


పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతుండగా ఇద్దరు గ్యాలరీ నుంచి దూకి స్మోక్ గన్స్ విసిరిన ఘటనలో నిందితులను పోలీసులు విచారించారు. అందులో ఒకరికి ప్రతాప్ సింహా కార్యాలయం సందర్శకుల పాస్ జారీ చేసినట్లు ప్రతిపక్షాలు ఆరోపించాయి.

నిందితుడి తండ్రి తమ నియోజకవర్గ వాసి అని.. పార్లమెంటు సందర్శించడానికి పాస్ ని కోరితే ఇచ్చానని ప్రతాప్.. స్పీకార్ ఓంబిర్లాకు తెలిపారు. పార్లమెంటు భద్రతా ఉల్లంఘనపై కేంద్ర హోంమత్రి అమిత్ షా ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఓ వైపు పార్లమెంటు ఘటనపై ఒత్తిడి పెరుగుండగా తాజాగా ఆయన సోదరుడు అరెస్టు కావడం కర్ణాటకలో చర్చనీయాంశం అయింది.

Updated Date - Dec 31 , 2023 | 11:51 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising