Ramesh Bidhuri: ఎంపీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రమేశ్ బిధూరికి కీలక బాధ్యతలు
ABN, First Publish Date - 2023-09-27T17:49:23+05:30
పార్లమెంట్‌లో బీఎస్‌పీ(BSP) ఎంపీ డానిష్ అలీ(Danish Ali)పై మతానికి వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన భారతీయ జనతా పార్టీ (BJP) ఎంపీ రమేష్ బిధూరికి ఆ పార్టీ కీలక బాధత్యలు అప్పగించింది. రానున్న రాజస్థాన్(Rajasthan) అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన సెవల్ని వినియోగించుకునేందుకు ఓ నియోజకవర్గ ఇంఛార్జీగా పార్టీ నియమించింది.
రాజస్థాన్: పార్లమెంట్‌లో బీఎస్‌పీ(BSP) ఎంపీ డానిష్ అలీ(Danish Ali)పై మతానికి వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన భారతీయ జనతా పార్టీ (BJP) ఎంపీ రమేష్ బిధూరికి ఆ పార్టీ కీలక బాధత్యలు అప్పగించింది. రానున్న రాజస్థాన్(Rajasthan) అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన సేవల్ని వినియోగించుకునేందుకు ఓ నియోజకవర్గ ఇంఛార్జీగా పార్టీ నియమించింది. రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్(Sachin Pilot) టోంక్ నియోజకవర్గం నుంచి పోటీలో దిగనున్నారన్న ఊహాగానాల నేపథ్యంలో అక్కడ ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుతో ఉన్న బీజేపీ రమేశ్ బిదూరీకి పార్టీ నియోజకవర్గ ఎన్నికల ఇంఛార్జీగా బాధ్యతలు అప్పగించింది.
ఇటీవల ఆయన ఎంపీపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై స్పీకర్ తో సహా ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. స్పీకర్ కు కాంగ్రెస్(Congress) పార్టీ రాసిన లేఖలో పార్లమెంట్ చరిత్రలో ఎన్నడూ మైనారిటీ వర్గానికి చెందిన సభ్యుడిపై ఇలాంటి పదాలు ఉపయోగించలేదు అని పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలు రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించారు. వివాదం నేపథ్యంలో బిధురి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ షోకాజ్ నోటీసులు జారీ చేసిందిబీజేపీ సైతం ఆయన కామెంట్స్ ని సీరియస్ గా తీసుకుంది. ఇంతలో ఎన్నికల బాధ్యతలు అప్పగించడం చర్చనీయాంశం అయింది.
Updated Date - 2023-09-27T17:50:19+05:30 IST