ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Indigo Flight: ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. చివర్లో ఊహించని ట్విస్ట్

ABN, First Publish Date - 2023-08-28T18:56:31+05:30

సోమవారం ఉదయం 6E6482 అనే ఇండిగో విమానం కొచ్చి నుంచి బెంగళూరుకి బయలుదేరింది. అది కొచ్చి విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకోవడమే ఆలస్యం.. అధికారులకు ఒక ఫోన్ కాల్...

సాంకేతికత అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి మోసపూరిత వ్యవహారాలు బాగా పెరిగిపోయాయి. దుండగులు ఏకంగా బాంబు బెదిరింపులకు పాల్పడే రేంజ్‌కి చేరిపోయారు. ఉద్రిక్త వాతావరణం నెలకొల్పాలన్న ఉద్దేశంతో.. కావాలనే కొందరు ఫేక్ కాల్స్ చేసి, బాంబు బెదిరింపులకు దిగుతున్నారు. ఇప్పుడు ఓ ఆగంతకుడు కూడా ఇలాంటి పనికే పాల్పడ్డాడు. ఇండిగో ఫ్లైట్‌లో బాంబు ఉందని తప్పుడు సమాచారం అందించాడు. దీంతో.. కొద్దిసేపు అల్లకల్లోలం నెలకొంది. అత్యవసరంగా విమానాన్ని ల్యాండ్ చేయడం, ప్యాసింజర్లను హుటాహుటిన దింపడం, అధికారులు రంగంలోకి దిగి పరిశీలించడం, చివరికి ఇదో ఫేక్ కాల్ అని తేలడం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..


సోమవారం ఉదయం 6E6482 అనే ఇండిగో విమానం కొచ్చి నుంచి బెంగళూరుకి బయలుదేరింది. అది కొచ్చి విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకోవడమే ఆలస్యం.. అధికారులకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. సరిగ్గా ఉదయం 10:30 గంటలకు ఈ ఫోన్ వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తి ఆ విమానంలో బాంబు ఉందని చెప్పి కాల్ కట్ చేశాడు. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే విమానాన్ని వెనక్కి రప్పించారు. విమానంలో ఉన్న ప్రయాణికుల్ని వెంటనే దింపేసి, సురక్షిత ప్రాంతానికి తరలించారు. విమానంలో ఒక చిన్నారి సహా మొత్తం 138 మంది ప్రయాణికులు ఉన్నారు. అనంతరం తనిఖీల కోసం విమానాన్ని ఐసోలేషన్ బేకు తరలించారు. కేరళ రాష్ట్ర పోలీసులు, బాంబు స్క్వాడ్‌తో పాటు భద్రతా విభాగాలు రంగంలోకి దిగాయి.

అటు విమానంలో, ఇటు బ్యాగేజీలను గంటసేపటి వరకు తనిఖీ చేశారు. అనుమానాస్పదంగా ఏమీ కనిపించకపోవడంతో.. తమకు వచ్చింది ఫేక్ ఇంటర్నెట్ కాల్ అని ధృవీకరించారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న అధికారులు.. కేసు నమోదు చేసి, ఫేక్ కాల్ చేసిందెవరో కనుగొనే పనిలో నిమగ్నమయ్యారు. కాగా.. ఆగస్టు 18వ తేదీ కూడా ఇలాంటి సంఘటనే ఢిల్లీలోనూ చోటు చేసుకుంది. బాంబు బెదిరింపు కాల్ రావడంతో.. తనిఖీల కోసం 8 గంటల పాటు విస్తారా ఎయిర్‌లైన్స్ ఫ్లైట్‌ను ఆపేశారు. ఫైనల్‌గా అనుమానాస్పదంగా ఏమీ దొరక్కపోవడంతో.. ఆ విమాన సేవల్ని పునరుద్ధరించారు.

Updated Date - 2023-08-28T18:56:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising