BRS MLC Kavitha: కవిత పిటిషన్‌పై సుప్రీం సడన్ డెసిషన్‌తో బీఆర్ఎస్‌లో మళ్లీ మొదలైన టెన్షన్
ABN, First Publish Date - 2023-03-23T16:41:20+05:30
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై ఈ నెల 24న కాకుండా ఈ నెల 27న సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది.
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా దుమారం రేపుతోన్న ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు(Delhi Liquor Scam case)లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(BRS MLC Kavitha) పిటిషన్‌పై ఈ నెల 24న కాకుండా ఈ నెల 27న సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. సుప్రీంకోర్టు(Supreme Court) కాజ్ లిస్ట్‌లో కవిత పిటిషన్ ఉంది. మహిళల విచారణపై ఈడీకి తగిన మార్గదర్శకాలు ఇవ్వాలంటూ సుప్రీంలో కవిత పిటీషన్ దాఖలు చేశారు. కవిత పిటీషన్‌పై న్యాయమూర్తులు అజయ్ రస్తోగి, బేలా త్రివేదీల ధర్మాసనం విచారణ జరపనుంది. కవిత పిటిషన్‌పై ఈనెల 24వ తేదీనే విచారిస్తామంటూ మొదట తెలిపిన సిజెఐ ధర్మాసనం ఆ తర్వాత 27వ తేదీకి మార్చింది.
వాస్తవానికి కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్(ED) అధికారులు మూడుసార్లు ప్రశ్నించారు. ఈ నెల 11, 20, 21 తేదీల్లో ఆమె మూడుసార్లు ఈడీ ఎదుట హాజరయ్యారు. తన వద్ద ఉన్న 10 ఫోన్లను ఈడీ అధికారులకు అప్పగించారు. కీలక పత్రాలు కూడా సమర్పించారు. కవిత ఈడీ ఎదుట హాజరైన ప్రతిసారీ ఆమెను అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరిగింది. అయితే ఈడీ అధికారులు ఆమెను అరెస్ట్ చేయలేదు. కేవలం ప్రశ్నించి వివరాలు రాబట్టుకున్నారు.
కవిత పిటిషన్‌పై సుప్రీం సడన్ డెసిషన్‌తో బీఆర్ఎస్‌లో మళ్లీ టెన్షన్ మొదలైంది. సుప్రీంలో కవిత పిటిషన్ విచారణకు మరో మూడు రోజుల గడువు పెరగడంతో ఈలోగా ఈడీ మరోసారి నోటీసులు జారీ చేయవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఈడీ తదుపరి నోటీసులు వస్తే కవిత అరెస్ట్ గ్యారంటీ అనే ప్రచారం జరుగుతోంది. దీంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.
ఢిల్లీలో రెండు రోజుల ఈడీ విచారణను ఎదుర్కొన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు చేరుకుని బేగంపేట విమానాశ్రయం నుంచి నేరుగా ప్రగతిభవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. మూడు రోజులుగా ఢిల్లీలో జరిగిన పరిణామాలను, ఈడీ విచారణ అంశాలపై కేసీఆర్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఈనెల 24న సుప్రీంకోర్టులో వాదనలు ఎలా ఉండాలనే దానిపైనా చర్చించినట్లు సమాచారం. ఈడీ విచారణ గురించి, తనను ప్రశ్నించిన అంశాలను, విచారించిన తీరును కేసీఆర్‌కు కవిత వివరించినట్లు తెలిసింది. బీజేపీని రాజకీయంగా.. కేంద్ర దర్యాప్తు సంస్థలను న్యాయపరంగా.. ఎలా ఎదుర్కొందామన్నదానిపై సీఎం సమాలోచనలు చేసినట్లు తెలుస్తోంది. ఇందుకుగాను ఎటువంటి వ్యూహాలను అనుసరించాలన్నదానిపై ఆయన పలు సూచనలు చేసినట్లు సమాచారం. సీఎంతో భేటీలో.. కవితతోపాటు మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు మరికొందరు పార్టీ నేతలున్నట్లు సమాచారం. ప్రగతి భవన్‌లో భేటీ నేపథ్యంలో చాలాసేపు అక్కడే గడిపిన కవిత.. ఆ తర్వాత హైదరాబాద్‌లోని తన నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యుల మధ్య ఉగాది పండుగను జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఇంట్లోనే ఆమె పూజాకార్యక్రమాలు నిర్వహించారు.
Updated Date - 2023-03-23T16:47:02+05:30 IST