Drone : పాక్ డ్రోన్‌ను కూల్చివేసిన బీఎస్ఎఫ్
ABN, First Publish Date - 2023-02-03T10:58:42+05:30
భారత్, పాక్ సరిహద్దుల్లో మరోసారి డ్రోన్ కలకలం సృష్టించింది...
అమృతసర్ (పంజాబ్): భారత్, పాక్ సరిహద్దుల్లో మరోసారి డ్రోన్ కలకలం సృష్టించింది.పంజాబ్‌లోని అమృతసర్ సెక్టార్(Amritsar sector)రియర్ కక్కర్ ప్రాంతంలో చొరబడిన పాక్ డ్రోన్‌ను బీఎస్ఎఫ్ దళాలు శుక్రవారం తెల్లవారుజామున కూల్చివేశాయి.(BSF shoots)పాకిస్థాన్ ఈ డ్రోన్(Pakistani drone) ద్వారా మాదకద్రవ్యాలు, ఆయుధాల సరఫరా కార్యకలాపాలు సాగిస్తుందని బీఎస్ఎఫ్ అధికారులు చెప్పారు.బిఎస్ఎఫ్ దళాలు సరిహద్దు కంచె వద్ద శుక్రవారం ఉదయం డ్రోన్ ను స్వాధీనం చేసుకున్నారు.(BSF troops had fired)
ఇది కూడా చదవండి : Air India: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో మంటలు
డ్రోన్‌తో పాటు నిషేధిత డ్రగ్స్ ప్యాకెట్‌ను బీఎస్ఎఫ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గత కొంత కాలంగా పంజాబ్ సరిహద్దుల్లో పాక్ వైపు నుంచి క్రమంగా అక్రమ కార్యకలాపాలు పెరిగాయి. చలికాలం కావడం... పొగ మంచు ఉండటంతో దాన్ని ఆసరా చేసుకుని పాక్ ఉగ్రవాదులు మాదకద్రవ్యాలను భారత్ లోకి పంపుతున్నారని బీఎస్ఎఫ్ అధికారులు చెప్పారు. గత రెండు రోజులుగా పంజాబ్ సెక్టార్‌లో జరిగిన మూడో సంఘటన.
Updated Date - 2023-02-03T10:58:48+05:30 IST