ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Rahul Gandhi: మోదీజీ..! మమ్మల్ని మీరేమైనా అనండి, ఉయ్ ఆర్ ఇండియా..

ABN, First Publish Date - 2023-07-25T14:24:36+05:30

గతంలో ఈస్ట్ అండియా కంపెనీ, ఇండియన్ ముజాహిదీన్ వంటి వారి పేర్లలో కూడా ఇండియా ఉందని విపక్షాల కూటమి ఇండియాపై ప్రధాని మోదీ వ్యాఖ్యానించడంపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఘాటుగా స్పందించారు. ''మోదీజీ...మీరు మమ్మల్ని ఏవిధంగానైనా పిలవండి...మేము INDIA'' అంటూ రాహుల్ ట్వీట్ చేశారు.

న్యూఢిల్లీ: విపక్షాల కూటమి INDIA అని పేరు పెట్టుకున్నంత మాత్రాన ప్రతిపక్షాల తీరు మారుతుందా అని ప్రధాన మంత్రి మోదీ ప్రశ్నించడం, గతంలో ఈస్ట్ అండియా కంపెనీ, ఇండియన్ ముజాహిదీన్ వంటి వారి పేర్లలో కూడా ఇండియా ఉందని వ్యాఖ్యానించడంపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఘాటుగా స్పందించారు. ''మోదీజీ...మీరు మమ్మల్ని ఏవిధంగానైనా పిలవండి... ఉయ్ ఆర్ ఇండియా'' అంటూ రాహుల్ ట్వీట్ చేశారు.


మణిపూర్ తిరిగి స్వస్థత పొందడానికి, ప్రతి ఒక్క మహిళ, చిన్నారుల కన్నీళ్లు తుడవడానికి తాము చేయూతనిస్తామని, ప్రజలందరిలోనూ ప్రేమ, శాంతి తిరిగి తీసుకువస్తామని రాహుల్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. భారతీయ ఆత్మను మణిపూర్‌లో పునరుద్ధస్తామని అన్నారు.


దీనికి ముందు, పార్లమెంటు భవనంలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో విపక్షాల ఇండియా కూటమిపై మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకప్పటి ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇండియన్ ముజాహిదీన్, చివరకు పీఎఫ్ఐ వంటి ఉగ్రవాద సంస్థల పేరులోనూ ఇండియా ఉందని అన్నారు. INDIA పేరు పెట్టుకున్నంత మాత్రన ప్రతిపక్షాల తీరు మారుతుందా? ఇలాంటి దిశ, దశ లేని ప్రతిపక్షాన్ని చూడలేదంటూ విమర్శించారు.


మణిపూర్ మండుతుంటే ఈస్ట్ ఇండియా మాటలేంటి?

కాగా, మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మంగళవారంనాడు రాజ్యసభలో తిప్పికొట్టారు. ఓవైపు మణిపూర్ రగులుతుంటే ప్రధానమంత్రి ఈస్ట్ ఇండియా కంపెనీ గురించి మాట్లడటం ఏమిటని నిలదీశారు. దీనికి ముందు, ఇండియా కూటమి సమావేశంలో మణిపూర్‌ విషయంపై మల్లికార్జున్ ఖర్గే ఛాంబర్‌లో ఇండియా కూటమి సమావేశమైంది. మణిపూర్ హింసపై పార్లమెంటులో మోదీ ప్రసంగించాలనే డిమాండ్ లక్ష్యంగా ఆయన సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంపై లోక్‌సభలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలనే నిర్ణయానికి కూడా వచ్చింది.

Updated Date - 2023-07-25T14:24:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising