Canada: కెనడా సాయుధ దళాల వెబ్‌సైట్‌ని హ్యాక్ చేసిన ఇండియన్ హ్యాకర్స్
ABN, First Publish Date - 2023-09-28T20:00:37+05:30
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్యోదాంతం తరువాత భారత్, కెనడాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. తాజాగా కెనడా సాయుధ దళాల అధికారిక వెబ్ సైట్ ని హ్యాక్ చేశారు.
కెనడా: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్యోదాంతం తరువాత భారత్, కెనడాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. తాజాగా కెనడా సాయుధ దళాల అధికారిక వెబ్ సైట్ ని హ్యాక్ చేశారు. ది టెలిగ్రాఫ్ నివేదిక ప్రకారం.. ఇండియన్ సైబర్ ఫోర్స్ అనే హ్యాకర్ల బృందం ఈ పని చేసినట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం సైట్ పని చేయడం ఆగిపోయింది. అనంతరం నేషనల్ డిఫెన్స్ డిపార్ట్‌మెంట్ మీడియా రిలేషన్స్ హెడ్ డేనియల్ లే బౌథిల్లియర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇండియన్ సైబర్ ఫోర్స్ ఎక్స్ అకౌంట్ లో కెనెడియన్ ఎయిర్ ఫోర్స్ వెబ్ సైట్ తీసేసినట్లు రాసుకొచ్చింది.
ఇందుకు సంబంధించి ఎర్రర్ మెసేజ్ ని అది షేర్ చేసింది. కెనడాలో నౌకాదళం, ప్రత్యేక కమాండ్ గ్రూపులు, వైమానిక, అంతరిక్ష, సైనిక కార్యకలాపాలను కలిగి ఉన్న ప్రత్యేక దళాలు సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాయి. కెనడియన్ సైబర్‌స్పేస్‌పై దాడి చేస్తామంటూ ఇండియన్ సైబర్ ఫోర్స్ సెప్టెంబర్ 21న కెనడాను బెదిరించింది. హర్దీప్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన సంచలన ఆరోపణలపై భారత్ భగ్గుమంది. అప్పుడి నుంచి ఆ దేశానికి సైబర్ హ్యాకింగ్ ముప్పు పొంచి ఉందని అంతా భావించారు. అనుకున్నట్లుగానే సాయుధ దళాల వెబ్ సైట్ హ్యాక్ కావడం వివాదాన్ని మరింత పెద్దదిగా చేసింది.
Updated Date - 2023-09-28T20:18:13+05:30 IST