Cancellation of trains: 12 వరకు చెన్నై - తిరుపతి రైళ్ల రద్దు.. కారణం ఏంటంటే...
ABN, First Publish Date - 2023-09-27T07:39:05+05:30
రేణిగుంట ప్రాంతంలో చేపట్టనున్న మరమ్మతుల కారణంగా చెన్నై - తిరుపతి(Chennai - Tirupati) రైళ్లు ఈనెల 28 నుంచి అక్టోబరు 12వ
పెరంబూర్(చెన్నై): రేణిగుంట ప్రాంతంలో చేపట్టనున్న మరమ్మతుల కారణంగా చెన్నై - తిరుపతి(Chennai - Tirupati) రైళ్లు ఈనెల 28 నుంచి అక్టోబరు 12వ తేది వరకు రద్దైనట్టు దక్షిణ రైల్వే పేర్కొంది. చెన్నై సెంట్రల్ నుంచి ప్రతిరోజు ఉదయం 6.25 గంటలకు బయల్దేరే సప్తగిరి ఎక్స్‌ప్రెస్ (నెం.16075), మధ్యాహ్నం 2.15 గంటలకు బయల్దేరే తిరుపతి ఎక్స్‌ప్రెస్ (నెం.16053), సాయంత్రం 4.35 గంటలకు బయల్దేరే గరుడాద్రి ఎక్స్‌ప్రెస్ (నెం.16203) రైళ్లు గురువారం నుంచి అక్టోబరు 12వ తేది వరకు రద్దయ్యాయి. అలాగే, తిరుపతి నుంచి ప్రతిరోజు ఉదయం 6.25 గంటలకు బయల్దేరే గరుడాద్రి ఎక్స్‌ప్రెస్ (నెం.16204), 10.10 గంటలకు బయల్దేరే చెన్నై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ (నెం.16054), సాయంత్రం 6.05గంటలకు బయల్దేరే సప్తగిరి ఎక్స్‌ప్రెస్ (నెం.16058) రైళ్లు అక్టోబరు 12వ తేది వరకు రద్దయ్యాయి.
Updated Date - 2023-09-27T07:39:05+05:30 IST