ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

HD Kumaraswamy: పెన్ డ్రైవ్ నా జేబులో ఉంది.. ఎప్పుడైనా బయటకు తీస్తా..!

ABN, First Publish Date - 2023-07-05T14:38:09+05:30

కాంగ్రెస్ పార్టీపై ఇటీవల కాలంలో ఒంటికాలిపై విరుచుకు పడుతున్న జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి ఈసారి తనదాడి మరింత ముమ్మరం చేశారు. ఆధారలతో సహా కాంగ్రెస్ అవినీతిని బయటపెడతానని హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన సాక్ష్యం తన జేబులోనే ఉందంటూ ఓ పెన్‌డ్రైవ్ బయటకు తీసి మీడియాకు చూపించారు.

బెంగళూరు: కాంగ్రెస్ (Congress) పార్టీపై ఇటీవల కాలంలో ఒంటికాలిపై విరుచుకుపడుతున్న జేడీఎస్ (JD-S) నేత హెచ్‌డీ కుమారస్వామి (HD Kumaraswamy) ఈసారి తనదాడి మరింత ముమ్మరం చేశారు. ఆధారలతో సహా కాంగ్రెస్ అవినీతిని బయటపెడతానని హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన సాక్ష్యం తన జేబులోనే ఉందంటూ ఓ పెన్‌డ్రైవ్ (Pen Drive) బయటకు తీసి మీడియాకు చూపించారు.

కర్ణాటకలోని కాంగ్రెస్‌ ప్రభుత్వ అవినీతి గురించి బుధవారంనాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.."నేను సాక్ష్యాలను జేబులో పెట్టుకుని తిరుగుతున్నా. ఎప్పుడైనా దాన్ని బయటకు రిలీజ్ చేస్తాను. సరైన సమాచారం లేకుండా నేను ఏదీ కూడా విడుదల చేయను. ఆఫీసర్ల పోస్టింగ్‌ల కోసం బాధ్యత కలిగిన మంత్రి ఎలా డబ్బులు తీసుకుంటారు? అదంతా ఇందులో ఉంది'' అంటూ ఓ పెన్‌డ్రైవ్‌ను ఆయన జేబులో నుంచి తీసి చూపించారు.

దీనికి ముందు, కుమారస్వామి గత ఆదివారంనాడు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. సామాన్య ప్రజల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. బాధ్యత కలిగిన విపక్ష పార్టీగా తాము ఈ అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తుతామని చెప్పారు. ఎన్నికల వాగ్దానాలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును నిలదీస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్ సూర్జేవాలాను కాంగ్రెస్ పార్టీ అనుమతించడంపై కుమారస్వామి ఇటీవల బహిరంగంగానే విమర్శించారు.

Updated Date - 2023-07-05T15:38:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising