ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

CNG, PNG Price : కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. గ్యాస్ ధరలు దాదాపు 11 శాతం తగ్గుదల..

ABN, First Publish Date - 2023-04-07T10:00:31+05:30

దేశవ్యాప్తంగా వినియోగదారులకు శనివారం నుంచి గొప్ప ఉపశమనం కలగబోతోంది. నేచురల్ గ్యాస్ ధరలను నిర్ణయించే విధానాన్ని

CNG, PNG
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా వినియోగదారులకు శనివారం నుంచి గొప్ప ఉపశమనం కలగబోతోంది. నేచురల్ గ్యాస్ ధరలను నిర్ణయించే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం గురువారం సవరించడంతో పైప్‌డ్ నేచురల్ గ్యాస్ (PNG), కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) ధరలు సుమారు 11 శాతం వరకు తగ్గబోతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) నేతృత్వంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు ఈ వివరాలు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ నూతన విధానం వల్ల ఇళ్లలోని వంట గదులకు సరఫరా చేసే పైప్‌డ్ నేచురల్ గ్యాస్, ఆటోమొబైల్స్‌కు సరఫరా చేసే కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ ధరలు శనివారం నుంచి 11 శాతం వరకు తగ్గుతాయి.

అనురాగ్ ఠాకూర్ (Anurag Thakur) మాట్లాడుతూ, బీజేపీ వ్యవస్థాపక దినోత్సవంనాడు ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. దీనివల్ల లక్షలాది మందికి ప్రయోజనం కలుగుతుందన్నారు. ముఖ్యంగా పీఎన్‌జీ, సీఎన్‌జీలను ఉపయోగించేవారికి దీనివల్ల లబ్ధి చేకూరుతుందన్నారు. బీజేపీ వ్యవస్థాపక దినోత్సవంనాడు ప్రజలకు మోదీ ఈ బహుమతిని ప్రకటించారని చెప్పారు. ఇది శుభదినం, మంచి నిర్ణయం అన్నారు. దీనివల్ల గృహ వినియోగదారులకు, అదేవిధంగా పారిశ్రామిక రంగానికి, రైతులకు మేలు జరుగుతుందన్నారు.

ధరలు తగ్గే విధానాన్ని వివరిస్తూ, పుణేలో కేజీ సీఎన్‌జీ రూ.92 ఉంటే, నూతన విధానం ప్రకారం అది రూ.87 అవుతుందన్నారు. పీఎన్‌జీ ధర రూ.57 ఉంటే, అది రూ.52కు తగ్గుతుందన్నారు.

ఇవి కూడా చదవండి :

ఎన్నికల వేళ.. బీజేపీకి షాకిచ్చిన యువనేత

New terminal: కొత్త టెర్మినల్‌ రెడీ.. రేపు ప్రధానిచే ప్రారంభం

Updated Date - 2023-04-07T10:00:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising