Covid Cases: పెరుగుతున్న కోవిడ్ కేసులపై కేంద్ర ఆరోగ్యశాఖ అలెర్ట్
ABN, Publish Date - Dec 20 , 2023 | 11:35 AM
National: దేశంలో కోవిడ్ కేసు సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. దీంతో పెరుగుతున్న కోవిడ్ కేసులపై కేంద్ర ఆరోగ్య శాఖ అలెర్ట్ అయ్యింది. బుధవారం కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ కేసుల (Covid Cases) సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. దీంతో పెరుగుతున్న కోవిడ్ కేసులపై కేంద్ర ఆరోగ్య శాఖ అలెర్ట్ అయ్యింది. బుధవారం కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా (Union Health Minister Mansukh Mandaviya) అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య సౌకర్యాలపై సమీక్ష సమావేశం చేపట్టారు. ఇన్ఫ్లుఎంజా అనారోగ్యం, తీవ్రమైన శ్వాసకోశ అనారోగ్యం, శ్వాసకోశ వ్యాధుల పెరుగుదలను కట్టడి చేయడం, కోవిడ్ అరికట్టడంపై సమీక్ష నిర్వహించారు.
కరోనా కేసుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని.. కరోనా విషయంలో టెన్షన్ పడాల్సిన అవసరం లేదని.. ఆసుపత్రుల్లో మాకు డ్రిల్స్ నిర్వహించాలని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి సూచనలు చేశారు. మూడు నెలలకు ఒకసారి హాస్పిటల్స్ లో మాక్ డ్రీల్ నిర్వహించాలన్నారు. కరోనా కేసులపై సర్వెలెన్స్ పెంచాలని ఆదేశించారు. కరోనా పరిస్థితిలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలని తెలిపారు. రాష్ట్రాలకు కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా వెల్లడించారు.
మరోవైపు దేశంలో కోవిడ్-19 యాక్టివ్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. నేటికి కేసుల సంఖ్య 2,311కి చేరింది. గత 24 గంటల్లో దేశంలో 341 కొత్త కేసులు నమోదయ్యాయి. కేరళలో కోవిడ్-19 కారణంగా ముగ్గురు మృతి చెందారు. ఇక రాష్ట్రాల వారీగా కేసులను పరిశీలిస్తే.. కేరళలో అత్యంత ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రాల వారీగా నమోదైన కేసుల వివరాలు చూస్తే.. కేరళలో 292, తమిళనాడులో 13, మహారాష్ట్రలో 11, కర్ణాటకలో 9, తెలంగాణ & పుదుచ్చేరిలో 4 చొప్పున, ఢిల్లీ & గుజరాత్‌లో 3 చొప్పున, పంజాబ్ & గోవాలో ఒకటి చొప్పున కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Dec 20 , 2023 | 11:55 AM