ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

POK: పీవోకే త్వరలో భారత్‌లో కలుస్తుందన్న కేంద్రమంత్రి.. ఇదో అవమానకరమైన స్టేట్మెంట్ అంటూ తిప్పికొట్టిన కాంగ్రెస్

ABN, First Publish Date - 2023-09-12T18:45:44+05:30

ఎన్నికల సమయం ఆసన్నమైందంటే చాలు.. రాజకీయ నేతల మాటలకు, హామీలకు అడ్డూ అదుపూ లేకుండా పోతుంది. ఓటర్లను ఆకర్షించేందుకు కొండల్ని తమ చేతులతో పిండి చేస్తామన్నట్టుగా గొప్పలకు...

ఎన్నికల సమయం ఆసన్నమైందంటే చాలు.. రాజకీయ నేతల మాటలకు, హామీలకు అడ్డూ అదుపూ లేకుండా పోతుంది. ఓటర్లను ఆకర్షించేందుకు కొండల్ని తమ చేతులతో పిండి చేస్తామన్నట్టుగా గొప్పలకు పోతారు. ఇదే సమయంలో కొందరు సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. వివాదాలకు తెరలేపుతుంటారు. తమకు పొలిటికల్ మైలేజ్‌ వస్తుందన్న ఉద్దేశంతో ఏదో చెప్పబోయి ఇరకాటంలో పడిపోతుంటారు. ఇప్పుడు కేంద్రమంత్రి, మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ వీకే సింగ్ కూడా అలాగే ఓ వివాదానికి బీజం వేశారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (POK) విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు.. రాజకీయ వర్గాల్లో సరికొత్త దుమారానికి తెరలేపాయి.


సోమవారం రాజస్థాన్‌లోని దౌసాలో పరివర్తన్ సంకల్ప్ యాత్ర కార్యక్రమం జరగ్గా.. ఇందులో అతిథిగా వీకే సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడగా.. POK విషయంపై ఒక విలేకరి ఆయనకు ఓ ప్రశ్న సంధించారు. ‘‘POK ప్రజలు భారత్‌లో కలవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ఈ అంశంపై బీజేపీ వైఖరి ఏమిటి’’ అని విలేకరి ప్రశ్నించాడు. ఇందుకు వీకే సింగ్ బదులిస్తూ.. ‘‘పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ తనంతట తానే భారత్‌లో విలీనం అవుతుంది. కాకపోతే.. ఇందుకు కొంత సమయం పడుతుంది. అప్పటివరకు వేచి ఉండాల్సిందే’’ అని సమాధానం ఇచ్చారు. ఈ విధంగా ఆయన చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు పెను సంచలనానికి దారి తీశాయి. ఆయన చేసిన వ్యాఖ్యల్ని కాంగ్రెస్ పార్టీ నేతలు పూర్తిగా ఖండిస్తున్నారు.

కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాత్ ఈ అంశంపై మాట్లాడుతూ.. ‘‘POK దేశంలో ఓ అంతర్భాగం. ఇది మన మాృతభూమిలో ఓ భాగం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇండియన్ యూనియన్‌లో అంతర్భాగమైన POK ఎప్పటికీ మనతోనే ఉంటుంది. కానీ.. దాన్ని వేరు చేస్తూ, భారత భూభాగంలో త్వరలోనే కలుస్తుందని చెప్పడానికి వీకే సింగ్‌కి ఎంత ధైర్యం’’ అని శ్రీనాథ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ సైతం వీకే సింగ్ మాటల్ని తప్పుపట్టారు. లడఖ్ సమస్యపై ప్రజల దృష్టి మరల్చేందుకే వీకే సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారన్నారు. ఒక రిపోర్ట్ ప్రకారం.. భారత సైన్యం గస్తీ తిరిగే 66 స్థానాల్లో 26 అందుబాటులో లేకుండా పోయాయని, ముందుగా వీకే సింగ్ దీని గురించి మాట్లాడాలని నిలదీశారు.

Updated Date - 2023-09-12T18:45:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising