ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Same-sex marriage : స్వలింగ వివాహాలకు గుర్తింపు.. రాష్ట్రాలను భాగస్వాములను చేయాలంటున్న కేంద్రం..

ABN, First Publish Date - 2023-04-19T13:20:59+05:30

స్వలింగ వివాహాల (Same-sex marriages)కు చట్టబద్ధమైన గుర్తింపు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారణలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు

Supreme Court
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : స్వలింగ వివాహాల (Same-sex marriages)కు చట్టబద్ధమైన గుర్తింపు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారణలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు భాగస్వామ్యం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టు (Supreme Court)ను కోరింది. పిటిషనర్లు లేవనెత్తిన అంశాలపై వ్యాఖ్యలు, అభిప్రాయాలను తెలియజేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను తాను ఏప్రిల్ 18న కోరినట్లు బుధవారం దాఖలు చేసిన అఫిడవిట్‌లో తెలిపింది.

స్వలింగ వివాహాలకు చట్టబద్ధమైన గుర్తింపు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్లపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎస్‌కే కౌల్, జస్టిస్ ఎస్ఆర్ భట్, జస్టిస్ హిమ కొహ్లీ, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుపుతోంది. మంగళవారం ప్రారంభమైన ఈ విచారణ బుధవారం కూడా కొనసాగింది.

సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా (Solicitor General Tushar Mehta) కేంద్ర ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తూ, స్వలింగ వివాహాలకు చట్టబద్ధమైన గుర్తింపు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారణలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు భాగస్వామ్యం ఇవ్వాలని కోరారు. అలాకాని పక్షంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో సంప్రదింపులు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలని కోరారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అభిప్రాయాలు, భయాందోళనలను సేకరించే ప్రక్రియ పూర్తయ్యే వరకు, వాటిని సర్వోన్నత న్యాయస్థానం ముందు సమర్పించే వరకు వేచి చూడాలని, ఆ తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోవాలని కోరారు.

స్వలింగ వివాహాలకు చట్టబద్ధ గుర్తింపును ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ, దాని ఫలితాల ప్రభావం దేశంపై చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంటుంది. ఈ విషయంలో సామాన్య ప్రజలకు, రాజకీయ పార్టీలకు అనేక అభిప్రాయాలు ఉన్నాయి.

మొత్తం మీద 15 పిటిషన్లపై ఈ విచారణ జరుగుతోంది. ఇద్దరు గే జంట పెళ్లి హక్కును అమలు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ కూడా విచారణలో ఉంది. ప్రత్యేక వివాహ చట్టం క్రింద పెళ్లిని నమోదు చేసుకోవడానికి సంబంధించి ఆదేశాలు జారీ చేయాలని వీరు కోరారు.

ఇవి కూడా చదవండి :

Maoist links case : ప్రొఫెసర్ సాయిబాబాకు సుప్రీంకోర్టులో భారీ షాక్

Karnataka Polls : స్వతంత్ర అభ్యర్థి డిపాజిట్ రూ.10 వేలు చెల్లించిన తీరు అందరినీ నవ్వుల్లో ముంచెత్తింది!

Updated Date - 2023-04-19T13:20:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising