Mehbooba Mufti: హిందూ రాష్ట్రంగా జమ్మూకశ్మీర్... బీజేపీపై కస్సుమన్న మాజీ సీఎం
ABN, First Publish Date - 2023-02-19T18:34:02+05:30
జమ్మూకశ్మీర్‌ను బీజేపీ రాష్ట్రంగా మార్చాలని ఆ పార్టీకి చెందిన కేంద్రం ప్రయత్నాలు సాగిస్తోందని పీడీపీ అధ్యక్షురాలు..
జమ్మూ: జమ్మూకశ్మీర్‌ను (Jammu Kashmir) బీజేపీ రాష్ట్రంగా మార్చాలని ఆ పార్టీకి చెందిన కేంద్రం ప్రయత్నాలు సాగిస్తోందని పీడీపీ అధ్యక్షురాలు, మాజీ ముఖ్యమంత్రి అన్నారు. స్థానిక డోగ్రా సామాజిక వర్గాన్ని ఉద్దేశపూర్వకంగానే దూరంగా పెడుతోందని, ఉన్నతాధికారులుగా ఆ వర్గానికి చెందిన ఒక్కరిని కూడా నియమించలేదని మండిపడ్డారు. ముస్లిం మెజారిటీ ఉన్న కశ్మీర్ లోయను బీజేపీ రాష్ట్రంగా మార్చాలనుకుంటోందని అన్నారు. ఆదివారంనాడిక్కడ పీడీపీ కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడుతూ, ముస్లింల కడగండ్లు తొలిగించి, వాళ్ల జీవితాలను బీజేపీ బాగుచేస్తుందని ఎవరైనా అనుకుంటే అది కేవలం భ్రమమాత్రమేనని అన్నారు.
జమ్మూకశ్మీర్‌లో లెఫ్టినెంట్ గవర్నర్, ఇతర ఉన్నతాధికారుల నియామకాలపై ఆమె ఆందోళ వ్యక్తం చేశారు. జమ్మూ భౌగోళిక పరిస్థితుల్లో మార్పులు జరుగుతున్నాయని, డోగ్రాలు ఎక్కడికి పోయారని ఆమె ప్రశ్నించారు. మన గవర్నర్ (ఎల్జీ) డోగ్రా కమ్యూనిటీకి చెందిన వారికి ఎందుకు ఇవ్వలేదు? డీజీ నుంచి ఎస్‌పీ వరకూ ఒక్క పోస్ట్ కూడా వారికి దగ్గక పోవడానికి కారణం ఏమటి? అని ఆమె నిలదీశారు. వాళ్లది(బీజేపీ) గాడ్సే కమ్యూనిటీ అని, స్వాంతంత్ర్య పోరాటంలో ఎలాంటి పాత్ర లేనివారని ఎద్దేవా చేశారు. ఇటీవల కశ్మీర్ లోయలో స్థానికుల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేయడాన్ని ఆమె నిలదీశారు. ఆర్టికల్ 370 అధికరణ ప్రాధాన్యత ఏమిటో ఇప్పుడు ప్రజలు గ్రహిస్తున్నారని, సామాన్య ప్రజానీకానికి ఆ అధికరణ ఒక రక్షణ కవచంలా ఉండేదని అన్నారు.
Updated Date - 2023-02-19T18:36:28+05:30 IST