ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrayaan-3: గుడ్ న్యూస్.. చంద్రయాన్ 3కి స్వాగతం పలికిన చంద్రయాన్ 2!

ABN, First Publish Date - 2023-08-21T22:20:48+05:30

చంద్రయాన్ 3 ఎప్పుడెప్పుడు చంద్రుడిపై అడుగుపెడుతుందా అని ఎదురుచూస్తున్న దేశ ప్రజలకు భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఓ శుభవార్త చెప్పింది.

చంద్రయాన్ 3 ఎప్పుడెప్పుడు చంద్రుడిపై అడుగుపెడుతుందా అని ఎదురుచూస్తున్న దేశ ప్రజలకు భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఓ శుభవార్త చెప్పింది. ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం చంద్రయాన్ 3 జాబిల్లిపై ఈ నెల 23 అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. అయితే అంతకు రెండు రోజుల ముందు జాబిల్లిపై అడుగుపెట్టే దిశగా ప్రయాణిస్తున్న చంద్రయాన్ 3కి చంద్రయాన్ 2 స్వాగతం పలికింది. అదేంటి చంద్రయాన్ 2 నాలుగేళ్ల క్రితమే విఫలమైంది కదా! అలాంటిది చంద్రయాన్ 3కి ఎలా స్వాగతం పలుకుతుందని ఆశ్చర్యపోతున్నారా?.. కానీ మీరు చదివింది నిజమే. 2019లో ప్రయోగించిన చంద్రయాన్ 2 మిషన్ విఫలమైనప్పటికీ, దానికి సంబంధించిన ‘ప్రదాన్’ అనే ఆర్బిటార్ చంద్రుని కక్ష్యలోనే ఉంది. ప్రస్తుతం చంద్రుని చుట్టూ ప్రదాన్ 100 కి.మీ x 100 కి.మీ కక్ష్యలో తిరుగుతుంది. ఈ క్రమంలోనే ఈ ప్రదాన్ ఆర్బిటార్ ఇస్రో శాస్త్రవేత్తల వ్యూహంలో భాగంగా చంద్రయాన్ 3లోని విక్రమ్ ల్యాండర్‌కు విజయవంతంగా అనుసంధానమైంది.


ఈ విషయాన్ని ఇస్రో అధికారికంగా ప్రకటించింది. ‘‘స్వాగతం మిత్రమా’’ అనే సందేశాన్ని చంద్రయాన్ 2 ఆర్బిటార్ చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాడర్‌కు పంపిందని పేర్కొంది. రెండింటి మధ్య అనుసంధానం జరిగినట్లు తెలిపింది. ల్యాండర్‌ మాడ్యుల్‌ను చేరుకునేందుకు బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్‌, కమాండ్‌ నెట్‌వర్కింగ్‌ కేంద్రానికి ఇప్పుడు మరిన్ని దారులు ఉన్నాయని ఇస్రో పేర్కొంది. అలాగే చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్‌ ల్యాండింగ్ ప్రక్రియకు సంబంధించిన ప్రత్యక్ష ప్రసారం బుధవారం సాయంత్రం 5.20 గంటల నిమిషాల నుంచి ప్రారంభమువుతందని ఇస్రో వెల్లడించింది. ఇస్రో వెబ్‌సైట్, యూట్యూబ్ ఛానెల్, ఫేస్‌బుక్, పబ్లిక్ బ్రాడ్ కాస్టర్ దూరదర్శన్‌లో చంద్రయాన్ 3 ల్యాండింగ్‌కు సంబంధించిన ప్రత్యక్ష ప్రసారం చూడొచ్చు.

కాగా చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించిన చంద్రయాన్ 3 ఇప్పటికే భూమి, చంద్రుడికి సంబంధించిన పలు చిత్రాలను ఇస్రోకు పంపిన సంగతి తెలిసిందే. భూమికి దూరంగా ఉండే, ఇప్పటివరకు ఎవరూ అన్వేషించని చంద్రుడి దక్షిణ ధృవ ప్రాంతంలోని ఫోటోలను చంద్రయాన్ తీసింది. ఈ ఫోటోలను ఇస్రో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం అవ్వాలని ప్రతీ భారతీయుడు కోరుకుంటున్నాడు. చంద్రయాన్ 3 గ్రాండ్ సక్సెస్ అవుతుందని ఇస్రో మాజీ చీఫ్, చంద్రయాన్ 2 ఇన్‌చార్జ్ కె. శివన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ‘చంద్రయాన్ 3 చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టడమనేది ఎంతో ఉత్కంఠతో కూడిన క్షణం’ అని ఆయన తెలిపారు.

Updated Date - 2023-08-21T22:32:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising